Homeటాప్ స్టోరీస్మరో 18 కోట్లు రాబట్టే సత్తా ఎన్టీఆర్ కు ఉందా ?

మరో 18 కోట్లు రాబట్టే సత్తా ఎన్టీఆర్ కు ఉందా ?

Will ntr takes buyers in safe zoneఅరవింద సమేత చిత్రాన్ని కొన్న బయ్యర్లు లాభాల బాటలోకి వెళ్ళాలంటే మరో 18 కోట్ల షేర్ రాబట్టాలి , అయితే ఆ సత్తా ఎన్టీఆర్ కు ఉందా అన్నది తేలాలి . దసరా సెలవులు కాబట్టి మొదటి వారంలో అరవింద సమేత 75 కోట్ల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా వసూల్ చేసింది . ఎన్టీఆర్ కున్న మాస్ ఇమేజ్ కి తోడూ దసరా సెలవులు కూడా కలిసి వచ్చాయి దాంతో 75 కోట్ల షేర్ వచ్చింది అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 93 కోట్ల బిజినెస్ చేసింది . అంటే బయ్యర్లు లాభాలలోకి రావాలంటే మరో 18 కోట్ల షేర్ రావాలి . దసరా సెలవులు ఈనెల 21 వరకు ఉన్నాయి అంటే మరో మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయి కాబట్టి మరో పది కోట్ల షేర్ రావచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

అరవింద సమేత చిత్రానికి అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి స్పందన తగ్గింది . నిర్మాత కు లాభాలు బాగానే వచ్చాయి కానీ బయ్యర్ల కు మాత్రం ఇంకా లాభాలు రాలేదు , నైజాం , సీడెడ్ లలో లాభాలు వచ్చేలా ఉన్నాయి కానీ మిగతా చోట్ల లో కొంతమందికి నష్టం వచ్చినా రావచ్చు అని అంటున్నారు . అయితే అరవింద సమేత చిత్రానికి పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలు ఏవి లేనందున మిగతా 18 కోట్ల షేర్ ని ఎన్టీఆర్ రాబడతాడేమో చూడాలి .

- Advertisement -

English Title: Will ntr takes buyers in safe zone

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All