Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్ లుక్ ఇదిగో

ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్ లుక్ ఇదిగో

Vidyabalan as basavataram in NTR biopicప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ లోని విద్యాబాలన్ లుక్ ని ఈరోజు విడుదల చేసారు ఆ చిత్ర బృందం . ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ బయోపిక్ లో ఎన్టీఆర్ భార్య బసవతారకం గా నటిస్తోంది బాలీవుడ్ భామ విద్యాబాలన్ . ఈ భామ ఎన్టీఆర్ భార్య పాత్ర పోషించడానికి పెద్ద మొత్తంలోనే డబ్బులు తీసుకున్నప్పటికీ ఈ భామ రాకతో ఎన్టీఆర్ బయోపిక్ క్రేజ్ మారిపోయింది . ఇతర పాత్రల్లో కూడా ప్రముఖ నటీనటులు నటిస్తుండటంతో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది .

తాజాగా విడుదలైన విద్యాబాలన్ లుక్ కు స్పందన బాగా వస్తోంది . ఎన్టీఆర్ జీవితంలో బసవరామతారకం పాత్ర కీలకమైనది కావడంతో విద్యాబాలన్ ని ఎంచుకున్నారు . డర్టీ పిక్చర్ తో హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు ఇల్లాలు పాత్రలో అలరించనుంది . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . జనవరి 9 న మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు , జనవరి 24 న ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలను విడుదల చేయనున్నారు .

- Advertisement -

English Title: Vidyabalan as basavataram in NTR biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All