Homeటాప్ స్టోరీస్హాట్ భామ విద్యాబాలన్ ఆ పాత్ర చేస్తుందా

హాట్ భామ విద్యాబాలన్ ఆ పాత్ర చేస్తుందా

vidya balan in balakrishnas ntr biopicడర్టీ పిక్చర్ తో భారీ అందాలను ఉదారంగా ఆరబోసి కుర్రాళ్లను , ముసలాళ్లను కూడా ఉర్రూతలూగించిన హాట్ భామ విద్యాబాలన్ తాజాగా తెలుగు చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది . బాలయ్య ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . మహానటుడు ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ అయితే బాగుంటుంది అని భావించిన దర్శకులు తేజ ఆమెని సంప్రదించడం ,భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి అంగీకరించడంతో విద్యాబాలన్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది .

 

- Advertisement -

అయితే ఇంకా అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించాల్సి ఉంది . మొదట ఈ పాత్రకు నిత్యా మీనన్ ని అనుకున్నారు కానీ నిత్యా మీనన్ ఆ పాత్ర ని పోషించడానికి నిరాకరించడంతో విద్యాబాలన్ ని ఎంచుకున్నారు . ఇక ఈ సినిమా ఈనెల 29 న రామకృష్ణా సినీ స్టూడియోస్ లో భారీ ఎత్తున ప్రారంభం కానుంది . వచ్చే ఏడాది 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ భావిస్తున్నాడు బాలయ్య .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All