Homeటాప్ స్టోరీస్150 కోట్ల దిశగా అరవింద సమేత

150 కోట్ల దిశగా అరవింద సమేత

Aravinda sametha towards 150 cr clubఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం 150 కోట్ల దిశగా దూసుకుపోతోంది . ఇప్పటికే 130 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించిన అరవింద మొదటి వారంలో 150 కోట్ల మార్క్ ని అందుకునేలా ఉంది . అక్టోబర్ 11 న విడుదలైన అరవింద సమేత చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లు వచ్చాయి , ఎన్టీఆర్ ఇమేజ్ కి తోడూ దసరా సెలవులు కూడా అరవింద కు బాగా కలిసి వచ్చాయి దాంతో 150 కోట్ల మార్క్ ని అందుకునేలా ఉంది . అయితే రేపటి నుండి ఎన్టీఆర్ కు అసలు పోటీ ఎదురుకానుంది . విశాల్ – రామ్ లు నటించిన చిత్రాలు విడుదల అవుతున్నందున ఎన్టీఆర్ సినిమాకు కోత పడటం ఖాయం . ఆ రెండు సినిమాలు బాగుంటే ఎన్టీఆర్ కు మరిన్ని కష్టాలు రావడం ఖాయం . అదేసమయంలో విశాల్ – రామ్ ల సినిమాలు బాగోలేకపోతే ఎన్టీఆర్ కు లాభం చేకూరడం ఖాయం .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి . కథ నాదే అంటూ గంగాధర్ అనే రచయిత ఆరోపిస్తుండగా , రాయలసీమని కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు రాయలసీమ స్టూడెంట్స్ . అయితే వీటిపై మాత్రం త్రివిక్రమ్ ఇంకా స్పందించలేదు . ఓవర్ సీస్ లో అరవింద సమేత వసూళ్లు తగ్గాయి , ఇక ఆంధ్రప్రదేశ్ లో తిత్లి భీభత్సం తో కూడా వసూళ్ళ పరంగా ఇబ్బంది ఎదురు అవుతోంది . లేదంటే ఎప్పుడో 150 కోట్లు దాటేసేది .

- Advertisement -

English Title: Aravinda sametha towards 150 cr club

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All