Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కు సవాల్ విసరనున్న ఇద్దరు హీరోలు

ఎన్టీఆర్ కు సవాల్ విసరనున్న ఇద్దరు హీరోలు

vishal and ram challenges to ntrయంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సవాల్ విసురుతున్నారు ఇద్దరు హీరోలు . ఇంతకీ ఎన్టీఆర్ ని సవాల్ చేసే ఇద్దరు హీరోలు ఎవరయ్యా అంటే ఒకరేమో విశాల్ కాగా మరొకరు రామ్ . ఈ ఇద్దరు హీరోలు నటించిన పందెం కోడి 2 , హలో గురూ ప్రేమకోసమే చిత్రాలు రేపు విడుదల కానున్నాయి . అక్టోబర్ 11 న విడుదలైన ఎన్టీఆర్ అరవింద సమేత రికార్డు స్థాయిలో వసూళ్ళ ని సాధిస్తోంది అయితే ఈ ఇద్దరు హీరోల చిత్రాల రాకతో ఏమైనా మార్పులు సంభావిస్తాయేమో అన్న ఆలోచన . ఎన్టీఆర్ స్పీడ్ కి ఈ ఇద్దరు హీరోలు బ్రేక్ వేస్తారా ? లేక మరింత జోష్ తో ముందుకు వెళ్ళేలా చేస్తారా ? అన్నది తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే .

పందెం కోడి పదమూడేళ్ళ క్రితం విడుదలై తెలుగు ,తమిళ బాషలలో సంచలన విజయం సాధించింది . కట్ చేస్తే పదమూడేళ్ళ తర్వాత దానికి సీక్వెల్ వస్తోంది దాంతో పందెం కోడి 2 పై భారీ అంచనాలు ఉన్నాయి . ఇక రామ్ సినిమా విషయానికి వస్తే …… దిల్ రాజు నిర్మించిన చిత్రం కావడం నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో మినిమం గ్యారెంటీ ఉంటుందని అనుకుంటున్నారు . ఇక అసలు విషయం ఏంటి ? ఎవరి సత్తా ఎంత ? దసరా బరిలో గెలిచేది ఎవరు అన్నది తేలాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -

English Title: vishal and ram challenges to ntr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All