Homeటాప్ స్టోరీస్నిజంగానే మహేష్ మళ్ళీ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా ?

నిజంగానే మహేష్ మళ్ళీ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా ?

 

- Advertisement -

మహర్షి చిత్రానికి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి తో వచ్చే ఏడాది మరో సినిమా చేయనున్నాడు మహేష్ బాబు అని వినిపిస్తోంది మహర్షి రిలీజ్ కి ముందునుండి .

అయితే మహర్షి రిలీజ్ అయ్యింది భారీ వసూళ్లని సాధించింది కానీ అనుకున్నట్లుగా ఇది సాలిడ్ బ్లాక్ బస్టర్ కాదు పోస్టర్ మీద మాత్రమే వేసుకునే ఎపిక్ బ్లాక్ బస్టర్ అన్నమాట .

ఈ సినిమాని కొన్న ఓవర్ సీస్ బయ్యర్ అలాగే రాయలసీమ బయ్యర్ లు నష్టపోయారు . అయినప్పటికీ మహర్షి సూపర్ హిట్ చిత్రం అంటూ ఊదరగొట్టేస్తున్నారు .

అంతేనా సల్మాన్ ఖాన్ హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం కూడా చేశారు . కట్ చేస్తే నేను రీమేక్ చేయడం లేదు అసలు మహర్షి చిత్రాన్నే చూడలేదు అంటూ షాక్ ఇచ్చాడు .

కట్ చేస్తే ఇపుడేమో అనిల్ రావిపూడి సినిమా అయ్యాక మళ్ళీ వంశీ పైడిపల్లి తోనే సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు . దాంతో నిజంగానే మహేష్ బాబు వంశీ కి ఛాన్స్ ఇస్తాడా ? లేక సల్మాన్ ఖాన్ న్యూస్ లాగా ఊదరగొట్టడం కోసమేనా ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All