Homeటాప్ స్టోరీస్సల్మాన్ ఖాన్ భారత్ చెత్త సినిమా అంటున్న కమల్

సల్మాన్ ఖాన్ భారత్ చెత్త సినిమా అంటున్న కమల్

బాలీవుడ్ క్రిటిక్ , నటుడు కమల్ ఆర్ ఖాన్ సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చెత్త సినిమా అని అంటున్నాడు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా సల్మాన్ ఖాన్ నటించిన భారత్ అనే సినిమా విడుదల అయ్యింది. కాగా ఆ సినిమాకు రివ్యూస్ కూడా అంతగా పాజిటివ్ గా రాలేదు. కొన్ని ఫరవాలేదు అని రాగా మరికొన్ని ప్లాప్ అంటూ తేల్చేశాయి. ఇక కమల్ ఆర్ ఖాన్ అనే నటుడు ప్లస్ ఫిల్మ్ క్రిటిక్ సల్మాన్ ఖాన్ భారత్ చెత్త సినిమా తన రివ్యూ ఇచ్చేసాడు.

- Advertisement -

సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే చెత్త సినిమా అంటూ విమర్శలు చేయడమే కాకుండా ప్రియాంక చోప్రా ఈ సినిమా తప్పుకొని మంచి పని చేసిందని అంటున్నాడు. భారత్ స్క్రిప్ట్ సరిగ్గా రాలేదు కాబట్టే ప్రియాంక చోప్రా ఈ సినిమా తప్పుకుందని ట్వీట్ చేసాడు కమల్ ఆర్ ఖాన్ . అయితే కమల్ ఆర్ ఖాన్ చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ప్రభాస్ బాహుబలి పై కూడా చాలా చులకనగా మాట్లాడాడు. మరో రెండు రోజులు ఆగితే కానీ తెలీదు సల్మాన్ ఖాన్ భారత్ సినిమా పరిస్థితి ఏంటి అన్నది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All