Homeటాప్ స్టోరీస్`వైల్డ్ డాగ్‌` మూవీ రివ్యూ

`వైల్డ్ డాగ్‌` మూవీ రివ్యూ

`వైల్డ్ డాగ్‌` మూవీ రివ్యూ
`వైల్డ్ డాగ్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  నాగార్జున‌, దియా మీర్జా, స‌యామీఖేర్‌, అతుల్ కుల‌క‌ర్ణి, అలీ రెజా, అవిజిత్ ద‌త్ త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌‌క‌త్వం: అహిషోర్ సాల్మ‌న్‌
నిర్మాత‌లు:  నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్‌‌రెడ్డి
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణం:  షా‌నెల్ డియో
మాట‌లు: ‌కిర‌ణ్ కుమార్
విడుద‌ల తేదీ: 02-04-2021
రేటింగ్‌: 3/5

టాలీవుడ్‌లో కొత్త క‌థ‌ల్ని, ద‌ర్శ‌కుల్ని ప్రోత్స‌హించ‌డంలో కింగ్ నాగార్జున ముందుంటారు. అలా కొత్త వాళ్ల‌కు అవాకాశాలిచ్చి ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచారు. ఆయ‌న మ‌రో కొత్త ద‌ర్శ‌కుడికి అవకాశం ఇచ్చిన చిత్రం `వైల్డ్ డాగ్‌`. హైద‌రాబాద్‌లో జ‌రిగిన వ‌రుస బాంబు పేలుళ్ల నేప‌థ్యంలో నిజ జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన  చిత్ర‌మిది. రియ‌లిస్టిక్ అంశాల‌తో అత్యంత స‌హ‌జంగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఆశించిన స్థాయిలోనే వుందా? అన్న‌ది తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
ఏసీపీ విజ‌య్ వ‌ర్మ ( నాగార్జున‌)కు వైల్డ్ డాగ్  అని పేరు. ఉగ్ర‌వాదుల్ని ప‌ట్టుకోవ‌డం కంటే ఎన్‌కౌంట‌ర్ చేయ‌డానికే ఇష్ట‌ప‌డుతుంటాడు. వ్య‌క్తిగ‌తంగా జ‌రిగిన ఓ విషాదం త‌రువాత ఎన్‌.ఐ.ఎ (నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ)లో చేర‌తాడు. జాన్ బేక‌రీలో జ‌రిగిన పేలుళ్ల వెన‌క సూత్ర‌ధారిని క‌నిపెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా రంగంలోకి దిగుతాడు. ఇండియ‌న్ ముజాహిదీన్‌కి చెందిన ఖ‌లీద్ హ‌స్తం ఉంద‌ని క‌నిపెడ‌తాడు. అత‌ను ఇండియా నుంచి నేపాల్‌కి వెళ్లాడ‌ని తెలుసుకున్న విజ‌య్‌వ‌ర్మ త‌న బృందంతో క‌లిసి అక్క‌డికి వెళుతాడు. దేశం కాని దేశంలో అత‌నికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? ‌పేలుళ్ల సూత్ర‌ధారి ఖ‌లీద్‌ని ఎలా ఇండియాకి తీసుకొచ్చాడు? .. ఆ త‌రువాత అత‌న్ని ఏం చేశాడు? అన్న‌దే ఇందులో ఆస‌క్తిక‌రం.

న‌టీన‌టుల న‌ట‌న‌:
ఎన్‌.ఐ.ఎ అధికారి విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో కింగ్ నాగార్జున క‌నిపించిన తీరు బాగుంది. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా క‌నిపించ‌డంతో పాటు యాక్ష‌న్ ఘ‌ట్టాల కోసం శ్ర‌మించిన తీరు ఆక‌ట్టుకునేలా వుంది. అయితే ఆయ‌న పాత్ర‌ని ఉద్దేశించి పెట్టిన టైటిల్ కు త‌గ్గ‌ట్టుగా ఫోర్స్డ్‌గా ఆయ‌న పాత్ర‌ని తీర్చి దిద్ద‌లేక‌పోయారు. రియాలిస్టిక్ అప్రోచ్‌తో సాగినా సినిమాటిక్ లిబ‌ర్టీస్ తీసుకుని ఆయ‌న పాత్ర‌ని మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా తీర్చి దిద్ది వుంటే బాగుండేది. ఇక దియా మీర్జా పాత్ర‌కు ఎలాంటి ప్రాధాన్యం లేదు. స‌యామీఖేర్ రా ఏజెంట్‌గా క‌నిపించి ఆక‌ట్టుకుంది. మిగ‌తా పాత్ర‌ల్లో న‌టించిన‌ అతుల్ కుల‌క‌ర్ణి, అలీ రెజా, అవిజిత్ ద‌త్ త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించారు.

సాంకేతిక నిపుణులు:
సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా వుంది. ఈ విభాగంలో ముందు చెప్పుకోవాల్సింది ఛాయాగ్ర‌హ‌కుడు షానీల్ డియో. త‌న ప‌నిత‌నంతో సినిమాకు నిండుద‌నం తీసుకొచ్చారు. సాంకేతిక విభాగంలో అత్య‌ధికంగా మంచి మార్కులు కొట్టేసింది ఈయ‌నే. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం బాగుంది. ర‌చ‌యిత అయిన అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌కుడిగా మాత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయార‌ని చెప్పాలి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. మేకింగ్ ప‌రంగా ద‌ర్శ‌కుడు మెప్పించారే కానీ క‌థ‌కుడిగా మాత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయారు.

తీర్పు:
చాలా ఏళ్ల క్రితం దేశ వ్యాప్తంగా జ‌రిగిన బాంబు పేలుళ్ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అయితే దీని వెన‌క ఎవ‌రున్నారు? ఈ ఆప‌రేష‌న్ వెన‌కున్న కొత్త విష‌యాల్ని ఈ చిత్రం ద్వారా చెప్పారా? అంటే అదేమీ లేదు. జ‌రిగిన సంఘ‌ట‌న‌నే మ‌ళ్లీ గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారంతే. పైగా క‌థ‌, క‌థ‌నం అంత ఆస‌క్తిక‌రంగా చెప్ప‌లేక‌పోయారు. అయితే ఎన్ ఐ.ఎ అధికారుల త్యాగాల్ని మాత్రం చూపించే ప్ర‌య‌త్నం చేశారు. నాగ్ అభిమానుల‌కు మాత్ర‌మే రుచించే సినిమా ఇది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All