
కింగ్ నాగార్జున నటించిన హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ `వైల్డ్ డాగ్`. 2007లో హైదరాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేళుళ్ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని అహిషోర్ సాల్మన్ రూపొందించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 2న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ని స్పీడప్ చేసేశారు. ఇందులో భాగంగా కింగ్ నాగార్జునతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారు. గత చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకోవాలని గట్టి పట్టుదలతో వున్నారు నాగార్జున. అయితే ఆడియన్స్‌ని మరింత ఎట్రాక్ట్ చేయడం కోసం గంగవ్వని రంగంలోకి దింపిన టీమ్ నాగ్‌ని గంగవ్వతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయించారు.
ఈ ఇంటర్వ్యూలో నాగ్‌ని గంగవ్వ ఫ్యామిలీకి సంబంధించిన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. సమంతకు ఏమైనా పిల్లలా అని అడిగింది. నేనూ అదే అడుగుతున్నా.. మనవడో మనవరాలినో ఇమ్మని అని నాగ్ సమాధానం చెప్పాడు. ఇక అఖిల్ పెళ్లి గురించి కూడా అడిగేసింది. దాంతో నాగ్ పెళ్లి విషయాన్ని తనకే వదిలేశానని చెప్పాడు. అయితే అదేంటి పిల్లని మనమే చూడాలి కాని కావాలంటే మా ఊళ్లో పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు చాలా మంది వున్నారంది. దీని నాగ్ గంగవ్వ ఇలా అడిగిందని అఖిల్‌తో చెబుతా అంటూ ఘొల్లున నవ్వేశారు.