Homeటాప్ స్టోరీస్విజిల్ తెలుగు రాష్ట్రాల డే 1 కలెక్షన్స్ - విజయ్ కెరీర్ బెస్ట్

విజిల్ తెలుగు రాష్ట్రాల డే 1 కలెక్షన్స్ – విజయ్ కెరీర్ బెస్ట్

విజిల్ తెలుగు రాష్ట్రాల డే 1 కలెక్షన్స్ - విజయ్ కెరీర్ బెస్ట్
విజిల్ తెలుగు రాష్ట్రాల డే 1 కలెక్షన్స్ – విజయ్ కెరీర్ బెస్ట్

ఎప్పటినుండో తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్న విజయ్ ఈ మధ్య కొంచెం సక్సెస్ అనుకున్నాడు. తుపాకీ, పోలిసోడు, అదిరింది వంటి సినిమాలతో విజయ్ తెలుగు మార్కెట్ లో క్రేజ్ ఏర్పరుచుకుంటున్నాడు. అయినా కానీ కార్తీ, సూర్య రేంజ్ లో ఇక్కడ విజయ్ కు క్రేజ్ రాలేదు. ఈ నేపథ్యంలో విజయ్ నుండి ఈ దీపావళికి విడుదలైన చిత్రం బిగిల్. ఈ చిత్రం తెలుగులో విజిల్ పేరుతో డబ్బింగ్ జరుపుకుని తమిళంతో పాటే ఒకేరోజు విడుదలైంది. పోటీగా బాక్స్ ఆఫీస్ బరిలో మరే తెలుగు చిత్రం లేకపోవడంతో విజయ్ కు ఇదే సరైన ఛాన్స్ అనుకున్నారు. విజయ్ తో ఇప్పటికే రెండు సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందించిన అట్లీ, హ్యాట్రిక్ హిట్ కోసం విజయ్ తో జత కలిసి తీసిన సినిమా బిగిల్. నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైంది. పోటీగా పెద్ద తెలుగు సినిమాలేం లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లు ఈ చిత్రానికి కేటాయించబడ్డాయి. దాదాపు 650 థియేటర్లలో ఈ చిత్రం ఇక్కడ విడుదలైంది.

పోటీగా తెలుగు చిత్రాలైతే లేవు కానీ మరో తమిళ డబ్బింగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే కార్తీ నటించిన ఖైదీ. రియలిస్టిక్ అప్రోచ్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హీరోయిన్, పాటలు లేకపోవడంతో ఆ జోనర్ ను ఇష్టపడేవారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మారింది. అయినా కానీ విజయ్ విజిల్ బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో సఫలమైంది. ప్రచారం బాగా జరగడం, ట్రైలర్, ప్రోమోలు ఆకట్టుకోవడం, పోటీగా విడుదలైన ఖైదీ ఒక వర్గం వారికే నచ్చే అవకాశముండడంతో మిగతా వర్గాలు విజిల్ వైపే ఆసక్తి కనబర్చాయి. అందుకే విజిల్ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ కెరీర్ లొనే బెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజుకి 2 కోట్ల 66 లక్షల షేర్ రాబట్టింది.

- Advertisement -

విజయ్ కెరీర్ లొనే బెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్నా కానీ ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 10.5 కోట్లు రాబట్టాలి. వీకెండ్ కావడం, టాక్ బాగుండడంతో ఈ రెండు రోజులు కలెక్షన్స్ కు ఢోకా లేదు. మరి ఆ తర్వాత ఈ చిత్ర ప్రదర్శన ఎలా ఉంటుందన్న దాన్నిబట్టి విజిల్ తెలుగులో లాభాలు తెచ్చిపెడుతుంది. ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ తండ్రి, కొడుకు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసాడు. అయితే మూడు లుక్స్ లో (మైఖేల్, బిగిల్, రాజప్ప ) కనిపిస్తాడు. నయనతార హీరోయిన్ గా నటించింది. రెహ్మాన్ సంగీతం అందించాడు.

విజిల్ రెండు తెలుగు రాష్ట్రాల డే 1 కలెక్షన్స్ షేర్ బ్రేక్ డౌన్

ప్రాంతం షేర్ (లక్షల్లో)

నైజాం 72.00

సీడెడ్ 57.20

నెల్లూరు 10.50

కృష్ణ 14.16

గుంటూరు 55.97

వైజాగ్ 24.00

ఈస్ట్ 19.00

వెస్ట్ 13.00

మొత్తం 265.83

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 200 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All