Homeటాప్ స్టోరీస్అరెరే.. విజయ్ మంచి అవకాశాన్ని వదులుకున్నాడే!

అరెరే.. విజయ్ మంచి అవకాశాన్ని వదులుకున్నాడే!

అరెరే.. విజయ్ మంచి అవకాశాన్ని వదులుకున్నాడే!
అరెరే.. విజయ్ మంచి అవకాశాన్ని వదులుకున్నాడే!

తమిళ హీరోల కన్ను ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులపై ఉంటూనే ఉంటుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా ఇక్కడ మార్కెట్ సంపాదించుకోవాలని చూస్తుంటారు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు పర భాషా నటులా, డబ్బింగ్ సినిమానా అని లెక్కలు వేసుకుని సినిమాలు చూడరు. సినిమా నచ్చితే అది ఎలాంటిదైనా నెత్తిన పెట్టుకుంటారు. దీనికి బాషా దగ్గరనుండి మొదలుపెడితే ఉదాహరణలు కోకొల్లలు. అందుకే తమిళ స్టార్ హీరోలు తమ మార్కెట్ ను విస్తరించుకోవడానికి తెలుగు రాష్ట్రాలను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటారు.

ఈ క్రమంలో రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ వంటి హీరోలు తెలుగులో తమకు స్థిరమైన మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. కానీ విజయ్, అజిత్ మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగులో పెద్దగా కలిసిరాలేదు. ముఖ్యంగా విజయ్, తెలుగులో మార్కెట్ కోసం చాలానే ప్రయత్నాలు చేసాడు. ఎలాగైనా ఇక్కడ హిట్ కొట్టాలని ప్రయత్నించి ఎట్టకేలకు పోలీసోడు, అదిరింది తుపాకీ తదితర చిత్రాలతో ఇక్కడ మార్కెట్ ను సంపాదించుకోగలిగాడు. తాజాగా దీపావళికి విడుదలవుతున్న విజిల్ చిత్రానికి ఇక్కడ బాగానే బిజినెస్ జరిగింది. దాదాపు 10 కోట్ల వరకూ పెట్టాడు ఇక్కడి డిస్ట్రిబ్యూటర్.

- Advertisement -

ఈసారి హిట్ కొట్టడానికి విజయ్ కు ఇది సువర్ణావకాశం. ఎందుకంటే ఈసారి దీపావళి బరిలో పేరున్న తెలుగు చిత్రాలేం లేవు. కార్తీ నటించిన ఖైదీ కూడా డబ్బింగ్ చిత్రమే. ఈ నేపథ్యంలో విజిల్ కొంచెం బాగుందని టాక్ తెచ్చుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఇక దీనికి ఎదురులేదు. ఈ నేపథ్యంలో విజయ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. నిన్న జరిగిన విజిల్ ప్రెస్ ఈవెంట్ కు చిత్ర దర్శకుడు, నిర్మాత, విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్స్ గా నటించిన అమ్మాయిలు అటెండ్ అయ్యారు. దీంతో ఫంక్షన్ మోస్తరుగానే జరిగింది. అదే ఈ ఈవెంట్ కు విజయ్ కనుక వచ్చి నాలుగు ముక్కలు తెలుగులో మాట్లాడి ఉంటే సినిమాపై మంచి బజ్ ఏర్పడి ఉండేది.

ఇప్పుడు కూడా బజ్ ఉంది కానీ విజయ్ కనుక వచ్చి ఉంటే ఆ లెక్కే వేరుగా ఉండేది. అందుకే విజయ్ ఒక మంచి అవకాశాన్ని మిస్ అయ్యాడే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా సినిమా విడుదలై మంచి విజయం సాధిస్తే విజయ్ సక్సెస్ మీట్ కు రావొచ్చని అంటున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఫుట్ బాల్ నేపథ్యం ఉన్న ఈ చిత్రంలో విజయ్ మూడు భిన్న గెటప్స్ లో కనిపించనున్నాడు. అయితే విజయ్ ది డబల్ రోల్ ఆ, ఒక్కడేనా? లేక ట్రిపుల్ రోల్ ఆ అన్నది సస్పెన్స్ గానే ఉంచారు. రహ్మాన్ స్వరాలు అందించిన ఈ చిత్రం రేపే విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 థియేటర్లు ఈ చిత్రానికి కేటాయించడం నిజంగా ఆశ్చర్యకరమే. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్ వద్ద విజయ్ ది 50 ఫీట్ కటౌట్ పెడుతున్నారంటే విజయ్ క్రేజ్ ఇక్కడ ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All