Homeటాప్ స్టోరీస్విజిల్ మూవీ రివ్యూ

విజిల్ మూవీ రివ్యూ

విజిల్ మూవీ రివ్యూ
విజిల్ మూవీ రివ్యూ

విజిల్ మూవీ రివ్యూ
నటీనటులు: విజయ్, నయనతార, వివేక్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్
దర్శకత్వం: అట్లీ
నిర్మాత‌లు: కళపతి ఎస్ అఘోరం
సంగీతం: ఏఆర్ రహ్మాన్
విడుదల తేదీ: 25 అక్టోబర్ 2019
రేటింగ్: 2.75/5

కథ :
విజిల్ కథ చాలా సింపుల్.. మనం ఇప్పటిదాకా చూసిన ఎన్నో స్పోర్ట్స్ డ్రామాస్ కు బేసిక్ గా ప్లాట్ విజిల్ లోనూ ఉంటుంది. చక్ దే ఇండియా, గోల్కొండ హై స్కూల్ తరహాలోనే విజిల్ సాగుతోంది. కాకపోతే కొంచెం మసాలాతో. మైఖేల్/బిగిల్ అమ్మాయిల ఫుట్ బాల్ టీమ్ కు తన తండ్రి కలను నెరవేర్చడానికి కోచ్ గా మారతాడు. తన తండ్రి కల ఏమిటి? ఎందుకు అసలు కోచ్ గా మారాల్సి వస్తుంది? చివరికి ఆ లక్ష్యాన్ని బిగిల్ చేరుకోగలిగాడా లేదా అన్నది మిగిలిన కథ.

- Advertisement -

నటీనటులు:
విజయ్ ఈ చిత్రంలో మూడు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడు. మూడింటి మధ్య వేరియేషన్స్ బాగా చూపించారు. మూడింట్లో ఆకట్టుకునే పాత్ర రాజప్ప. సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లడంలో రాజప్ప క్యారెక్టర్ సహాయపడుతుంది. అలా అని మిగిలిన రెండు పాత్రలు మైఖేల్/బిగిల్ బాలేవు అని కాదు కానీ రాజప్ప పాత్రను సంథింగ్ స్పెషల్ గా తీర్చిదిద్దాడు అట్లీ. విజయ్ ఈ మూడు పాత్రల్లోనూ మెప్పిస్తాడు. ఇందాక చెప్పుకున్నట్లు రాజప్ప పాత్రలో విజయ్ నటన ఫ్యాన్స్ ను పూనకాలు తెప్పిస్తుంది.

నయనతార ఉన్నంతలో బాగా చేసింది. కానీ ఆమెను మరీ చిన్న పాత్రకే పరిమితం చేసేసారు. కథిర్, యోగి బాబులకు మంచి పాత్రలు పడ్డాయి. ముఖ్యంగా యోగి బాబు పాత్ర కామెడీ రిలీఫ్ ను ఇస్తుంది. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ ఇద్దరికీ లిమిటెడ్ పాత్రలు దక్కాయి. ఉన్నంతలో వారు పర్వాలేదు. మిగిలిన వారు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణులు:
ఈమధ్య కాలంలో ఏఆర్ రహ్మాన్ నుండి అద్భుతమైన పాటలు రాలేదు. విజిల్ లో కూడా పాటలు అమితంగా ఏం ఆకట్టుకోవు. ఓకే తరహాలో అనిపిస్తాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం రహ్మాన్ మెప్పిస్తాడు. దర్శకుడి ఆలోచనకు అనుగుణంగా ఏ సీన్లు లేపాలో ఆ సీన్ల దగ్గర కరెక్ట్ రీ రికార్డింగ్ జరిగిన భావన కలుగుతుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపిస్తుందంటే అది కచ్చితంగా సినిమాటోగ్రాఫర్ ప్రతిభే. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. చాలా ఎక్కువ సేపు సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రస్తావించుకోవాలి. చేతికి ఎముక లేని చందంగా నిర్మాత ఖర్చుపెట్టాడు. అట్లీకి ఇది నాలుగో సినిమా అయినా కూడా ఒక స్టార్ హీరోని హ్యాండిల్ చేసిన విధానానికి మెచ్చుకోవచ్చు. అయితే కథ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే కచ్చితంగా విజిల్ ప్రేక్షకుల చేత ఆపకుండా విజిల్స్ వేయించేది.

చివరిగా:
విజయ్ తమిళంలో సూపర్ స్టార్. కథ కన్నా కూడా తన మ్యానరిజమ్స్, తను హైలైట్ అయ్యే తీరు ఫ్యాన్స్ కు అవసరం. వాళ్ళను ఆకర్షించేవి కూడా అదే. అట్లీ సరిగ్గా ఈ పాయింట్ పట్టుకున్నాడు. అట్లీ ఇప్పటిదాకా చేసినవి నాలుగు సినిమాలు. విజిల్ వరసగా విజయ్ తో మూడో సినిమా. విజయ్ లాంటి స్టార్ ను ఎలా హ్యాండిల్ చేయాలో అట్లీ బాగా అవపోశన పట్టేసాడు. అది విజిల్ లో అడుగుగడుగునా కనిపిస్తుంది. స్టోరీ చాలా చిన్నగా ఉన్న ఈ చిత్రాన్ని అట్లీ నడిపించిన తీరు ఫ్యాన్స్ కు అయితే ఫుల్ మీల్స్ తరహాలో ఉంటుంది. సాధారణ ప్రేక్షకులకు కూడా బానే అనిపిస్తుంది.

మనం ఏం చెప్పినా ఆకట్టుకునేలా చెప్పాలి. పాత సరుకే అయినా సరికొత్తగా ప్రెజంట్ చేయాలి.. ఈ సూత్రాన్ని బాగా నమ్ముతాడు అట్లీ. అందుకే ఇది వరకు మనం చాలా సినిమాల్లో చూసేసిన సీన్లే కనిపిస్తున్నా విజిల్ ఆసక్తి కలిగిస్తుంది. అసలు ఫస్ట్ హాఫ్ లో కథ అనేది లేకపోయినా ఎంగేజింగ్ గా అనిపిస్తుందంటే అది అట్లీ స్క్రీన్ ప్లే ప్రతిభే. అలా అని చెప్పి మొత్తం కథ లేకుండా సినిమాను పూర్తి చేయలేరు కదా.. అందుకే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ ను ప్రవేశపెట్టాడు అట్లీ. ఇది తెలుగు ప్రేక్షకులకు కొంచెం ఓవర్ డోస్ గా అనిపించినా మొత్తానికి ఓకే అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఓవర్ గా అనిపించడం, సీన్స్ లాజిక్స్ లేకపోవడం వంటివి ఉన్నా కానీ మొత్తంగా చూసుకుంటే ఒకసారి చూడదగ్గ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ విజిల్. స్టోరీ రొటీన్ అన్నది ఒకటే మేజర్ కంప్లైంట్.

విజిల్ – సౌండ్ గట్టిగానే వస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All