
మరొక్క రోజులో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి థియేటర్లలో వాలిపోనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కువగా చిరంజీవి, తమన్నా పాల్గొన్నారు. నిజానికి ఈ చిత్రంలో తమన్నా పాత్ర చిన్నది, నయనతారదే మెయిన్ హీరోయిన్ రోల్. అయినా కానీ తమన్నా రోల్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అన్నట్లు ప్రోజెక్ట్ ఐంది.
నయనతార ఎక్కడా ప్రమోషన్స్ లో కనిపించలేదు. అసలు నయనతార ఏ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనదు. అది ఆమె రూల్. సినిమాకి సైన్ చేసే ముందే నయనతార ఈ విషయం చెప్పేస్తుంది. అలా అయితేనే సినిమా చేస్తానంటుంది. అయినా సైరా నిర్మాత రామ్ చరణ్ నయన్ కు ప్రమోషన్స్ కు ఒప్పించొచ్చని భావించాడు. ఇది ఒక పీరియాడిక్ సినిమా అందునా మెగాస్టార్ సినిమా, అందుకే ప్రమోషన్స్ కు నయన్ వస్తుందనుకున్నాడు.
మీడియాకు కూడా అదే హింట్ ఇచ్చాడు. కానీ చివరికి నయన్ మాత్రం రాలేదు. తాను నమ్మిందానికే ఫిక్స్ అయింది. అందుకే కేవలం తమన్నా మాత్రమే ప్రమోషన్స్ లో పాల్గొంది. సౌత్ ఇండియా వరకూ నయన్ కు క్రేజ్ ఎక్కువ. ఆమె ముందుకు వచ్చి ఉంటే తమిళనాడు, కేరళలో మరింతగా క్రేజ్ ఏర్పడేది. అందుకే ఈ ఒక్క విషయంలో చరణ్ ఓడిపోయాడు అనేది.