Homeటాప్ స్టోరీస్నాని మొత్తానికి అలా ఓకే చెప్పాడట

నాని మొత్తానికి అలా ఓకే చెప్పాడట

vivek atreyas film with nani narrated much before
vivek atreyas film with nani narrated much before

న్యాచురల్ స్టార్ నాని మిడ్ రేంజ్ హీరోలలో టాప్ పోసిషన్ లో కొనసాగుతున్నాడు. నానితో సినిమా చేస్తే మినిమమ్ గ్యారంటీ కలెక్షన్స్ అన్న భావన నిర్మాత, దర్శకులలో ఉంది. అలాగే నాని సినిమా వస్తోందంటే మినిమమ్ గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ అందిస్తాడన్న భావన ప్రేక్షకులలో ఉంది. ఏదైనా కొత్త కథ తీసుకొస్తే కచ్చితంగా అవకాశమిస్తాడన్న ఆశ యువ దర్శకులలో ఉంది. అందుకే ఏదైనా కొత్త రకమైన కథ యువ దర్శకుల నుండి వస్తే అది ముందు నాని దగ్గరకే వెళ్తోంది. ఏడాదికి మినిమమ్ రెండు చిత్రాలతో నాని కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ఈ ఇయర్ కూడా నాని  ఫుల్ బిజీ. ఈ ఏడాదికి నాని క్యాలెండర్ ఇప్పటికే నిండిపోయింది.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో V సినిమా రిలీజ్ కు ఎదురు చూస్తున్న నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే ఈ ఏడాది రాహుల్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటించనున్నాడు. దీంతో పాటు నాని మరో యువ దర్శకుడికి అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయ నానికి కథ వినిపించడం జరిగింది. అయితే అది ఇప్పుడు కాదు. తన తొలి సినిమా మెంటల్ మదిలో కంటే ముందే నానిని వివేక్ ఆత్రేయ కలిసాడు.

- Advertisement -

అయితే కొత్త దర్శకుడు కావడంతో తనని ప్రూవ్ చేసుకుని రమ్మని నాని చెప్పడం, తొలి సినిమాతోనే అందరిలో దృష్టిలో పాడడం జరిగిపోయాయి. రెండో సినిమా కూడా వెంటనే ఓకే అయిపొయింది. ఇక బ్రోచేవారెవరురా విడుదలైన తర్వాత మళ్ళీ తను ముందు నానికి చెప్పుకున్న కథకు ఇంకొన్ని మెరుగులు దిద్ది తిరిగి తీసుకెళ్లాడు. ఈసారి నాని కూడా సై అన్నాడు. అలా ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. వచ్చే ఉగాదికి సినిమాను దించాలని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All