Homeటాప్ స్టోరీస్నాని సినిమాకు పోటీ పెరిగిపోతోందిగా

నాని సినిమాకు పోటీ పెరిగిపోతోందిగా

నాని సినిమాకు పోటీ పెరిగిపోతోందిగా
నాని సినిమాకు పోటీ పెరిగిపోతోందిగా

న్యాచురల్ స్టార్ నాని మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ హీరో. అతనిలో నిలకడగా మినిమం గ్యారంటీ వసూళ్లు తెచ్చే హీరో మరొకరు లేరు. అలాగే కంటెంట్ విషయంలో కూడా నాని నిరుత్సాహపరిచిన సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా అరుదనే చెప్పాలి. అందుకే నానికి ఉన్న ఫాలోయింగ్, నాని సినిమాలకు ఉండే బజ్ మిగతా మిడ్ రేంజ్ హీరోలకు దక్కడం లేదు. నాని ఇప్పటికే 24 సినిమాలను కంప్లీట్ చేసుకున్నాడు. తన 25వ సినిమా V తనకు చాలా ప్రత్యేకం.

తన మొదటి చిత్రాన్ని తెరకెక్కించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి తోనే తన 25వ సినిమాను చేయడం విశేషం. అలాగే ఈ సినిమాలో పూర్తి స్థాయి నెగటివ్ క్యారెక్టర్ పోషించాడు నాని. దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఆసక్తి కూడా అందరిలో ఉంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మార్చ్ 25న విడుదలకు షెడ్యూల్ అయింది. ఈ సినిమా విడుదలను జనవరిలోనే ప్రకటించారు. ఫిబ్రవరి, మార్చ్ అన్ సీజన్ కావడంతో ఉగాది రోజున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు.

- Advertisement -

అయితే నాని సినిమా ఉన్నా కానీ వేరే సినిమా వాళ్ళు ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పుడు సినిమాలను రిలీజ్ చేసుకుని ఇబ్బంది పడే కంటే ఉగాదికి రావడం మేలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే V చిత్రానికి పోటీగా రాజ్ తరుణ్ సినిమా ఒరేయ్ బుజ్జిగా వస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాను కూడా మార్చ్ 25నే విడుదల చేయబోతున్నారు. అలాగే ఇప్పుడు ఈ రెండు చిత్రాలకు తోడు అదే రోజున మరో సినిమా కూడా వచ్చి చేరింది.

ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా చేసిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా కూడా అదే రోజు విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని మొదటి కాలం నీలి నీలి ఆకాశం ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటతో సినిమాపై విపరీతమైన బజ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నాని సినిమాకు ఎంత వరకూ పోటీ ఇస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All