Homeటాప్ స్టోరీస్నాని రిస్క్ ఫలించిందిగా!

నాని రిస్క్ ఫలించిందిగా!

నాని రిస్క్ ఫలించిందిగా!
నాని రిస్క్ ఫలించిందిగా!

ఈ కాలంలో నిర్మాతలు ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చిన కాడికి అమ్మేసుకుని చేతులు దులుపుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి ప్రేక్షకుల ముందుకు సినిమా వెళ్లిందంటే అది ఏమవుతుందో తెలియని పరిస్థితి. చాలా తక్కువ శాతం సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ కావడంతో ముందు నిర్మాత సేఫ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ మధ్య థియేట్రికల్ రైట్స్ తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ కు కూడా భారీ మొత్తాలు వస్తుండడంతో నిర్మాత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ కింద ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు భారీ మొత్తాలను ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. దీంతో రిలీజ్ కు ముందే అన్ని రకాల హక్కులు అమ్ముడుపోవాలని ప్రయత్నిస్తున్నారు.

అయితే నాని మాత్రం ఈ విషయంలో రిస్క్ చేసాడు. సక్సెస్ కూడా సాధించాడు. నాని ఇటీవల నిర్మించిన చిత్రం హిట్. థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి థియేట్రికల్ హక్కుల ద్వారానే నాని సేఫ్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చింది. అయితే నాని మాత్రం నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో చెప్పిన రేటుకి కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. తక్కువలోనే ఈ సినిమాను సొంతం చేసుకోవాలనుకున్నారు. దర్శకుడు కొత్తవాడు. హీరోకు ఇమేజ్ తక్కువే కాబట్టి హిట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో, ప్రేక్షకుల నుండి ఆదరణ ఎలా ఉంటుందోనని నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో నాని చెప్పిన రేటుకి కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.

- Advertisement -

ఐతే నాని మాత్రం కాంప్రమైజ్ కాలేదు. రిస్క్ చేయడానికే ఫిక్స్ అయ్యాడు. నాన్ థియేట్రికల్ రైట్స్ క్లోజ్ చేయకుండానే సినిమాను విడుదల చేసేసాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ నిర్ణయం ఫలించింది. హిట్ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో నాని చెప్పిన రేటు కాదు దానికంటే 30 శాతం ఎక్కువిచ్చి సినిమాను కొనాలని చూస్తున్నారు. వచ్చిన దాంట్లో బెస్ట్ డీల్ చూసుకుని వీలైనంత త్వరగా నాన్ థియేట్రికల్ హక్కులను అమ్మేయాలని చూస్తున్నాడు నాని.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All