Homeటాప్ స్టోరీస్వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన విశ్వక్ సేన్

వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన విశ్వక్ సేన్

వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన విశ్వక్ సేన్
వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన విశ్వక్ సేన్

చైనా సైనికుల దాష్టీకానికి దుర్మార్గానికి సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. దేశం మొత్తం ఈ సంఘటనపై రగిలిపోతోంది. దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అంటూ యావత్ దేశం నినదిస్తోంది. ఈ నేపథ్యంలో కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్లు ఆర్ధిక సహాయం తో పాటు ఇంటి స్థలం, సంతోష్ బాబు సతీమణికి గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు సీఎం కెసిఆర్ . దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే ఆయన కుటుంబాన్ని యంగ్ హీరో విశ్వక్ సేన్ కలిసి పరామర్శించారు.
సూర్యాపేట లోని సంతోష్ బాబు ఇంటికి ఈరోజు వెళ్లిన విశ్వక్ సేన్ కుటుంభం సభ్యుల్ని పరామర్శించి కల్నల్  సంతోష్ బాబు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All