Homeటాప్ స్టోరీస్సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు

సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు

సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు
సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు

వంచనకు మారుపేరైన చైనా దురాగతానికి బలైపోయారు కల్నల్ సంతోష్ బాబు. దేశం కోసం ప్రాణాలని పణంగా పెట్టిన వీరుడికి యావత్ దేశం అశ్రు నయనాలతో కన్నీటి వీడ్కోలు పలికింది. కల్నల్ సంతోష్ బాబు పార్ధీవ దేహానికి గురువారం మధ్యాహ్నం సూర్యాపేటలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

సూర్యా పేట సమీపం లో వున్నా కేసారంలో సంతోష్ బాబు కుటుంభానికి సంభందించిన వ్యవసాయ క్షేత్రంలో లాంఛనంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. సూర్యాపేట లోని స్వగృహం నుంచి 6 కిలోమీటర్ల మేర సంతోష్ బాబు అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో కరోనాను కూడా లెక్కచేయకుండా మాస్కులు ధరించి ప్రజలు వందల సంఖ్యలో హాజరయ్యారు. సంతోష్ బాబు కు జోహార్లంటూ నినదించారు.
సూర్యాపేట స్థానికులు భవనాలపై నించి సంతోష్ బాబు పార్థివ దేహం పై పూల వర్షం కురిపించారు. తండ్రి సంతోష్ బాబు కు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు కుమార్తె తండ్రి కి సైనిక వందనం చేస్తూ నాన్నా నాన్నా అంటూ అరిచినా అరుపులు వేల  హృదయాల్ని కదిలించింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All