
కంగన రనౌత్ వివాదం మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రినే ఏక వచనంతో సంబోధిస్తూ త్వరలో నీ అహం కూడా కూలుతుందని, దమ్ముండే తన ని కూడా చిధ్రం చేయమంటూ ఉద్దవ్ ఠాక్రేని ఉద్దేశిస్తూ కంగన సంచలన వ్యాఖ్యలు చేయడం దేశ వ్యాప్తంగా సంచనం సృష్టిస్తోంది. ఓ వర్గం ఆమెని విమర్శిస్తుంటే మరి కొంత మంది కంగన ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
తాజాగా హీరో విశాల్ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనని భగత్‌సింగ్‌తో పోల్చడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తన అకౌంటెంట్ కారణంగా వార్తల్లో నిలిచి సంచలనం సృష్టించిన విశాల్ తాజాగా కంగనపై సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కంగన తెగువకు, ధైర్య సాహసాలకు ముగ్ధుడైన విశాల్ ఏకంగా ఆమెని ప్రశంసల్లో ముంచేస్తూ ఓపెన్ లెటర్ రాశారు.
`కంగన.. నీ గట్స్‌కు, ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్. నీ వ్యక్తిగత సమస్య కాకపోయినా ధైర్యంగా నిలబడి ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నావ్. 1920లో భగత్‌సింగ్ చేస్తున్నట్టే చేస్తున్నావ్. ప్రభుత్వాలు తప్పు చేసిన్పుడు తమ గొంతుకని ఎలా వినిపించాలో ప్రజలకు చూపించావు. ఒక సెలబ్రిటీనే కాకుండా సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చినందుకు వందనాలు. అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సెలబ్రిటీల్లో వైరల్‌గా మారింది.