Homeటాప్ స్టోరీస్విశాల్ పెళ్లి చేసుకుంటా అ‌న్నాడ‌ట‌!

విశాల్ పెళ్లి చేసుకుంటా అ‌న్నాడ‌ట‌!

విశాల్ పెళ్లి చేసుకుంటా అ‌న్నాడ‌ట‌!
విశాల్ పెళ్లి చేసుకుంటా అ‌న్నాడ‌ట‌!

టాలీవుడ్‌లో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో సంచ‌ల‌నం సృష్టించిన శ్రీ‌రెడ్డి త‌ర‌హాలో మీరా మిథున్ కోలీవుడ్‌ని ఓ ఊపు ఊపేస్తోంది. ఆమె విమ‌ర్శించ‌ని స్టార్ హీరో , హీరోయిన్ లేడు… హీరోయిన్ లేదు. త్రిష‌పై ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది. తాజాగా హీరో విశాల్పై విరుచుకుప‌డుతోంది. స్టార్ హీరోలు విజ‌య్‌, సూర్య‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వారి ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి గురైన మీరా మిథున్ తాజాగా హీరో విశాల్‌పై చేసిన వ్యాఖ్య‌లు త‌మిళ‌నాట సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఓ వీడియోలో మీరా మిథున్ హీరో విశాల్‌లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `హీరో విశాల్ గ‌త రెండు మూడేళ్లుగా త‌న‌ని వివాహం చేసుకుంటాన‌ని వెంట‌ప‌డుతున్నాడ‌ని, డ‌బ్బు, పేరున్న వారిని పెళ్లి చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, ఆ కార‌ణంగానే తాను విశాల్‌తో వివాహానికి నిరాక‌రించాన‌ని మీరా మిధున్ స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

అంతే కాకుండా తన త‌ల్లికి విశాల్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, కానీ అత‌న్ని వివాహం చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని మీరా మిధున్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై హీరో విశాల్ ఎలా స్సందిస్తారో చూడాలని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All