
హీరో విశాల్, ఆయన తండ్రి జీకె రెడ్డి లకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే భయపడాల్సిన పనేమీ లేదని, తాను, తన ఫాదర్ కోలుకుంటున్నామని వెల్లడించడంతో ఫ్యాన్స్ అంతా ఊపరి పీల్చుకున్నారు. అయితే చాలా మంది విశాల్ అభిమానులు కరోనా బారి నుంచి ఎలా బయటపడాలి. ఎలాంటి మందుల్ని వాడుతున్నారని, వాటి వివరాలు వెల్లడించండని విశాల్‌ని సోషల్ మీడియా వేదికగా కోరారు.
దీంతో విశాల్ తను, తన తండ్రి ఎలా కోవిడ్ బారి నుంచి కోలుకుంటున్నారు? ఎలాంటి మందులు వాడుతున్నారో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయుర్వేదిక మెడిన్‌ల కారణంగానే తాము త్వరగా కోలుకుంటున్నట్టు విశాల్ వెల్లించారు. తాను వాడుతున్న టాబ్లెట్స్, సిరప్‌లకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అవి GFS – QR SYRUP, ARSENIC ALBUM, PAT (SYRUP) వాడానని, వీటిలో GFS – QR SYRUP డేలో మూడు సార్లు, ARSENIC ALBUM టాబ్లెట్లని రోజు ఉదయం 5 , సాయంత్రం 5.. ఐదు రోజుల పాటు వేసుకున్నానని.. PAT (SYRUP) ని డైలీ మూడు సార్టు తీసుకున్నానని వెల్లడించారు.
ఇవన్నీ చెన్నైలోని ఆయుర్వేద అండ్ హోమియోపతి మెడికల్ షాపుల్లో లభిస్తాయని స్పష్టం చేశాడు. అయితే వీటిని వాడే ముందు డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు హీరో విశాల్. దీంతో ఈ మెడిసిన్ కోసం చాలా మంది ఇప్పటికే ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు.
Been receiving many request to share medicine details, sharing the same that cured us during the Covid situation,
Pls consult your Doctor & it’s available @ all Ayurvedic & Homeopathy Stores in Chennai
Once again Many Thanks to Dr Hari Shankar, GB U for your Service to Mankind pic.twitter.com/u0dGhgo7Tt
— Vishal (@VishalKOfficial) July 27, 2020
Credit: Twitter