
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించింది. దేశాలన్నీ స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయాయి. చిన్నా పెద్దా, రిచ్, పూర్ అని తేడా లేకుండా అంతా ఇంటి పట్టునే వుంటూ స్వీయ నిర్భంధాన్ని పాటిస్తున్నారు. ఇంటి పట్టునే వుంటూ చిత్ర విచిత్రమైన ఫీట్‌లు చేస్తూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
కొంత మంది వర్కవుట్ వీడియోల్ని పోస్ట్ చేస్తుంటే మరి కొంత మంది నచ్చిన వంటకాలు చేస్తూ నెటిజన్స్‌తో పంచుకుంటున్నారు. కానీ త్రిష మాత్రం వెరైటీగా ఆన్ లైన్‌లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటోంది. లాక్‌డౌన్ సమయంలో క్వారెంటైన్ కు పరిమితమైన త్రిషకు ఉన్నట్టుండి ఫిల్మ్ మేకింగ్‌పై మనసు మళ్లిందట.
దీంతో క్రేజీ దర్శకుడు గౌతమ్ మీనన్‌ని లైన్‌లోకి తీసుకుంది. తన ఆలోచనని చెప్పడంతో త్రిష ఆసక్తిని గమనించిన గౌతమ్ మీనన్ ఆన్‌లైన్‌లో ఫిల్మ్ మేకింగ్ పాఠాలు నేర్పుతున్నారు. షాట్స్ ఎలా తీయాలో, ఫోకే వీడియోస్‌ని ఎలా షూట్ చేయాలో చెప్పేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోని త్రిష అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్‌లో వైరల్‌గా మారింది.
What a fun morning?Can’t wait to show you guys what we filmed??
Thank you @menongautham pic.twitter.com/yt42CeI4nS— Trish (@trishtrashers) May 1, 2020