Homeటాప్ స్టోరీస్నాలుగు భాష‌ల్లో విశాల్ `చ‌క్ర‌` హంగామా!

నాలుగు భాష‌ల్లో విశాల్ `చ‌క్ర‌` హంగామా!

నాలుగు భాష‌ల్లో విశాల్ `చ‌క్ర‌` హంగామా!
నాలుగు భాష‌ల్లో విశాల్ `చ‌క్ర‌` హంగామా!

`పందెంకోడి` సినిమాతో యాక్ష‌న్ హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు హీరో విశాల్‌. ఆ క్రేజ్‌కి భిన్నంగా ఊర మాస్ సినిమాల‌తో పాటు ఫుల్ క్లాస్ చిత్రాల్లోనూ న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌ల సైబ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `అభిమ‌న్యుడు` చిత్రంతో సాలీడ్ హిట్‌ని ద‌క్కించుకున్న విశాల్ మ‌రోసారి అదే త‌ర‌హా క‌థ‌తో చేస్తున్న సైబ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `చ‌క్ర‌`. ఎం.ఎస్‌. ఆనంద‌న్ ద‌ర్శ‌కుడు.

శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో రెజీనా, సృష్టి దాంగే న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ ట్రైల‌ర్ గ్లింప్స్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. `అభిమ‌న్యుడు` త‌ర‌హాలో `చ‌క్ర‌` కొత్త‌గా వుంటుంద‌నే సంకేతాల్ని అందించింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ ఏక‌కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ నెల 27న ఈ నాలుగు భాష‌ల‌కు సంబంధించిన ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ `ఇటీవ‌ల విడుద‌ల చేసిన పోస్ట‌ర్ కి, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ ల‌భిస్తోంది. ఈ శనివారం ఒకేసారి నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌నుండ‌టం చాలా ఆనందంగా వుంది` అన్నారు. `అభిమ‌న్యుడు` త‌ర‌హా బ్యాంక్ రాబ‌రీ నేప‌థ్య‌మంలో సైబ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా అత్యున్న‌త సాంకేతికి విలువ‌ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All