
యాక్షన్ చిత్రాల హీరోగా విశాల్‌కు తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరుంది. ఇటీవల `అభిమన్యుడు` చిత్రంతో కొత్త తరహా సినిమాని ప్రేక్షకులకు అందించి రెండు భాషల్లోనూ విజయాన్ని సొంతం చేసుకున్నారు. విశాల్ తాజాగా మరోసారి అదే తరహాలో విభిన్నమైన కథ, కథనాలతో చేస్తున్న చిత్రం `చక్ర`. ఎం.ఎస్. ఆనందన్ దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రలో రెజీనా నటిస్తోంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఆఫ్ ట్రైలర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. హ్యాకింక్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. `ది గేమ్ బిగిన్స్.. హ్యాకింగ్ ఈజ్ నో జోక్ ఓకే` అంటూ రెజీనా చేసిన ట్వీట్ సినిమా ఏ నేపథ్యంలో వుంటుందనేది తెలియజేస్తోంది. బ్యాంక్ రాబరీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కొత్త పంథాలో విశాల్ నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా వుంది. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఫస్ట్ గ్లింప్స్‌తో ప్రచారం మొదలుపెట్టిన ఈ చిత్రాన్ని థియేటర్స్ రీ ఓపెన్‌ని బట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో సినిమాల్ని చేస్తున్న విశాల్ ప్రస్తుతం `తుప్పారివాలన్`కు సీక్వెల్‌గా రూపొందుతున్న `తుప్పారివాలన్ 2`లో నటిస్తూ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్‌డేట్ త్వరలోనే రానున్నట్టు తెలిసింది.