Homeటాప్ స్టోరీస్విశాల్ `చ‌క్ర‌` ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

విశాల్ `చ‌క్ర‌` ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

విశాల్ `చ‌క్ర‌` ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!
విశాల్ `చ‌క్ర‌` ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

యాక్ష‌న్ చిత్రాల హీరో విశాల్ న‌టిస్తున్న తాజా చిత్రానికి `చ‌క్ర‌` అనే టైటిల్‌ని క‌న్ఫ‌ర్మ్ చేశారు. విశాల్ ఫిల్మ్  ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై హీరో విశాల్ న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎస్‌. ఆనంద‌న్ ద‌ర్శ‌కుడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని చిత్ర బృందం సోమ‌వారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసింది.

క‌రోనా వైర‌స్ ప్రారంభానికి ముందే ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా రెజీనా కాసాండ్ర‌, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ న‌టిస్తున్నారు. పోస్ట‌ర్‌, టైటిల్ డిజైన్‌ని బ‌ట్టి చూస్తే ఇదొక ఆర్మీ ఆఫీస‌ర్ నేప‌థ్యంలో `అభిమ‌న్యుడు` త‌ర‌హాలో సాగుతుంద‌నే సంకేతాల్ని అందిస్తోంది.

- Advertisement -

గ‌త కొంత కాలంగా క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో త‌న అభిమానుల‌కు ఎలాంటి ఫిల్మ్ అప్‌డేట్స్‌ని అందించ‌ని విశాల్ `చ‌క్ర‌` ఫ‌స్ట్ లుక్‌తో మ‌ళ్లీ సంద‌డి చేయ‌డం మొద‌లుపెట్టారు. కొత్త త‌ర‌హా క‌థా, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని విశాల్ స‌న్నాహాలు చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన టీజ‌ర్ కూడా రిలీజ్ కానున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All