
విశాల్ హీరోగా నటించిన తమిళ చిత్రం `తుప్పారివాలన్`. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా `తుప్పారివాలన్ 2`ని లండన్ నేపథ్యంలో మొదలుపెట్టారు. దీనికీ మిస్కినే దర్శకుడు. ఈ రెండింటికీ హీరో విశాల్ నిర్మాతగా వ్యవహరించాడు. అయితే తనతో అనవసరంగా 13 కోట్లు ఖర్చు చేయించండని, ఓ నిర్మాతగా సినిమా నిర్మాణం గురించి ప్రశ్నిస్తే తప్పేంటి?. దుబారా వద్దంటూ దర్శకుడికి సూచనలు ఇస్తే అది తప్పెలా అవుతుంది? అంటూ విశాల్ దర్శకుడు మిస్కిన్‌పై నిప్పులు చెరిగారు.
బడ్జెట్ వివాదం ముదురుతుండటంతో అతన్ని తప్పించి తానే దర్శకుడిగా మారి మిగతా చిత్రాన్ని పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మిస్కిన్‌ని అగౌరపరచడం తన ఉద్దేశం కాదని, తనలా మరో నిర్మాత ఇబ్బందులు ఎదుర్కోకూడదనే తాను ఇలా ఓపెన్‌గా స్పందించానని విశాల్ వివరించారు కూడా. అయితే మిస్కిన్ విషయంలో విశాల్ ఓపెన్‌గా స్పందించడం నచ్చని నటుడు, నిర్మాత ఇషాన్ శంకర్ ఇండైరెక్ట్‌గా విశాల్ పై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
`మిస్కిన్ సర్ మీ స్క్రిప్ట్‌ని, మిమ్మల్ని ఎల్లప్పుడూ నమ్ముతాం. మా సంస్థ వేల్‌లో సినిమా చేయడానికి మీరు సిద్ధంగా వుంటే నేనూ సిద్ధంమే` అని పోస్ట్ పెట్టారు. ఇది కోలీవుడ్‌లో ఇప్పుడు వైరల్‌గా మారింది. విశాల్ నడిగర్ సంఘం ఎన్నికల వేళ ఇషార్‌శంకర్ హీరో విశాల్‌తో పోటీపడ్డారు. ఆ వైరాన్ని మనసులో పెట్టుకుని ఇషార్‌శంకర్ ఇలా వ్యవహరించడం ఆసక్తికరంగా మారింది. దీనిపై హీరో విశాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.