
“అసలు నేను నా సినిమా గురించి ఇలాంటి సమాధానం చెప్పవలసి వస్తుందని అనుకోలేదు. కానీ “విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ” అంటే ఇండస్ట్రీ లో మరియు బయట ఉన్న గౌరవ మర్యాదలు పోకుండా ఉండాలనే ఇంత వివరణ ఇస్తున్నా..!” అంటూ విశాల్ ఎందుకు ప్రస్తుత సినిమా “తుప్పరివాలన్ 2” (తెలుగులో డిటెక్టివ్ 2) నుండి డైరెక్టర్ మిస్కిన్ వెళ్ళిపోయారు.?; విశాల్ ఎందుకు ఈ సినిమాను స్వయంగా డైరెక్షన్ చేస్తున్నారు.? అనే ప్రశ్నలకు సమాధానంగా ఒక లేఖను మీడియాకు విడుదల చేసారు. దానితోపాటు అనుకున్న సమయానికి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని కూడా తెలియచేసారు.
తను విడుదల చేసిన లేఖను ఇంగ్లీష్ మరియు తమిళ భాషలలో విశాల్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ లేఖలో వివరంగా,
ఇంత పెద్ద డైరెక్టర్ మళ్ళీ తను స్క్రిప్ట్ రాసుకోడానికి UK మరియు కెనడా వెళ్ళడానికి 35 లక్షలు ఖర్చు చేసాడు.?
అప్పటికీ 13 కోట్లు సినిమా మీద ఖర్చుపెట్టినా ఆయనకు ఎందుకు సినిమా మీద క్లారిటీ రాలేదు.?
ఎందుకు డే లేదా నైట్ కాల్షీట్ మొత్తం నటీనటులు, టెక్నీషియన్స్ ఇస్తున్నా… రోజుకు 2 సీన్ లు మాత్రమే చేస్తానన్నాడు.?
ఒక రోజుకు కేవలం 3 – 4 గంటల షూటింగ్ కోసం అది కూడా విదేశీ లోకేషన్స్ లో రోజుకు రూ.15 లక్షలు అధికంగా ఖర్చు అవుతున్నా… ఆ ప్రొడ్యూసర్ తిరిగి డైరెక్టర్ ని ఏమీ అడగకూడదా.?
లాంటి ప్రశ్నలు మనతో పంచుకున్నారు విశాల్. ఏది ఏమైనా తనను బ్లెస్ చెయ్యాలని, నిజానిజాలు మీతో పంచుకుందామని తప్ప, ఎవరినీ తప్పు పట్టే ఉద్దేశ్యం తనకు లేదనీ విశాల్ క్లారిటీ ఇచ్చారు.