Homeటాప్ స్టోరీస్మెగాస్టార్ సినిమాలో రెజీనా చేసింది ఐటమ్ సాంగ్ కాదట

మెగాస్టార్ సినిమాలో రెజీనా చేసింది ఐటమ్ సాంగ్ కాదట

మెగాస్టార్ సినిమాలో రెజీనా చేసింది ఐటమ్ సాంగ్ కాదట
మెగాస్టార్ సినిమాలో రెజీనా చేసింది ఐటమ్ సాంగ్ కాదట

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం శరవేగంగా తన తర్వాతి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు కాగా చిరంజీవి లెఫ్ట్ భావాలున్న వ్యక్తిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోన్న విషయం తెల్సిందే. జూన్ కల్లా సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు. ఇటీవలే ఒక చిత్ర వేడుకలో ఈ సినిమా టైటిల్ ఆచార్య అని చిరంజీవి రివీల్ చేసేసాడు. త్వరలోనే ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలున్నాయి.

ఇక ఈ సినిమా ఇప్పటికే మూడు పాటల షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయాన్ని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఈ మూడు పాటల్లో ఒకటి ఐటమ్ సాంగ్ కూడా ఉంది. అందులో చిరు సరసన రెజీనా ఆడిపాడింది. అయితే ఆమె ఈ సాంగ్ ను ఐటమ్ సాంగ్ అనొద్దు అంటోంది. “సాధారణంగా నేను ఐటమ్ సాంగ్స్ ను వ్యతిరేకిని. కానీ ఇందులో నటించేది చిరంజీవి కాబట్టి ఒప్పుకున్నా. నేను అభిమానించే నటుల్లో చిరంజీవి ఒకరు. ఆయన డ్యాన్స్ అంటే నాకెంతో ఇష్టం. ఆయన ఒక గొప్ప డ్యాన్సర్. ఆయన డ్యాన్స్ లు చూసి ఇన్స్పైర్ అవుతుంటాను” అని చెప్పుకొచ్చింది రెజీనా.

- Advertisement -

పనిలో పనిగా దీన్ని ఐటమ్ సాంగ్ అనొద్దు అని అంటోంది. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు మనం వవింటుంటాం. ఐటమ్ సాంగ్ అనకండి ఇది స్పెషల్ సాంగ్ అని చెబుతుంటారు హీరోయిన్లు. అయితే రెజీనా దీనికి కొత్త పేరుని పెట్టింది. రెజీనా, చిరుతో కలిసి చేసిన ఈ సాంగ్ సెలబ్రేషన్ సాంగ్ అట. అలాగే దాన్ని పిలవమంటోంది.

మరి సినిమా విడుదలయ్యాక ఈ సెలబ్రేషన్ సాంగ్ ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడాలి. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ తో కలిసి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All