Homeటాప్ స్టోరీస్భారీ అంచనాలతో వస్తున్న సర్కార్

భారీ అంచనాలతో వస్తున్న సర్కార్

Vijay's SARKAR eyes on new recordsతమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున 80 దేశాల్లో 3000 థియేటర్ లలో విడుదల కానుంది . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తక్కువేమి తినలేదు ఇక్కడ కూడా ఏకంగా 700 థియేటర్ లలో విడుదల చేస్తున్నారు . విజయ్ కి తెలుగునాట అంతగా క్రేజ్ లేదు కానీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడం , రాజకీయ నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో సర్కార్ ని 700 థియేటర్ లలో రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు . విజయ్ రాజకీయాలపై సెటైరికల్ గా వేసే డైలాగ్స్ థియేటర్ లలో ఈలలు వేయించడం ఖాయమని అంటున్నారు .

రాజకీయ వ్యంగ్య చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం కోసం చెన్నై లో 24 గంటల పాటు నాన్ స్టాప్ గా షోలు వేయనున్నారు . అసలు 48 గంటలపాటు షోలు వేయాలని ప్లాన్ చేసారు కానీ కోర్టు అందుకు నిరాకరించి 24 గంటలకు పరిమితం చేసింది . అయితే 24 గంటల పాటు నాన్ స్టాప్ షోలు వేసి రికార్డ్ స్థాయిలో వసూళ్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు . ఓవరాల్ గా మొదటి రోజు , మొదటి వారం రికార్డులు సర్కార్ వశం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు . విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది .

- Advertisement -

English Title: Vijay’s SARKAR eyes on new records

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All