Homeటాప్ స్టోరీస్సర్కార్ ఎన్ని దేశాల్లో విడుదల అవుతుందో తెలుసా

సర్కార్ ఎన్ని దేశాల్లో విడుదల అవుతుందో తెలుసా

Grand release for vijay's SARKARతమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రాన్ని నవంబర్ 6 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నందున పెద్ద ఎత్తున ఇతర దేశాలలో కూడా విడుదల చేయనున్నారు . ఇక ఈ సినిమా ఎన్ని దేశాల్లో విడుదల అవుతుందో తెలుసా ……. ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో విడుదల చేస్తున్నారు సర్కార్ చిత్రాన్ని . ఇన్ని దేశాల్లో విడుదల చేస్తున్నారంటే విజయ్ కున్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం అవుతోందిగా . పైగా మురుగదాస్ దర్శకత్వం వహించిన సినిమా ఇది . ఇంతకుముందు విజయ్ – మురుగదాస్ ల కాంబినేషన్ లో వచ్చిన తుపాకీ , కత్తి చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి దాంతో హ్యాట్రిక్ కోసం మళ్ళీ సర్కార్ గా వస్తున్నారు .

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సర్కార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు బ్రహ్మాండమైన వ్యూస్ వచ్చాయి . దాంతో దేశ దేశాల్లో ఈ సినిమాకు డిమాండ్ ఏర్పడింది . దాంతో 80 దేశాల్లో సుమారుగా 3000 థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు . ఇంత పెద్ద స్థాయిలో విడుదల అంటే భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం . విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది .

- Advertisement -

English Title: Grand release for vijay’s SARKAR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All