Homeటాప్ స్టోరీస్సర్కార్ సినిమా సకాలంలో విడుదల అవుతుందా ?

సర్కార్ సినిమా సకాలంలో విడుదల అవుతుందా ?

Release problem for vijay's sarkarతమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రం విడుదల సమస్య ఎదుర్కొంటోంది . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర కథ నాదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత కోర్టు ని అలాగే రచయితల సంఘం ని ఆశ్రయించాడు . అయితే రచయితల సంఘం అధ్యక్షుడు అయిన కే భాగ్యరాజా సర్కార్ కథ , వరుణ్ రాజేంద్రన్ రాసిన సెంగోల్ కథ ఒకే లాగా ఉందని అది పెద్ద మ్యాటర్ కాదని అయితే స్క్రీన్ ప్లే యాజిటీజ్ లేదు కాబట్టి కాపీ అనలేమని చెప్పాడట !దాంతో కోర్టు ని ఆశ్రయించాడు రాజేంద్రన్ . తనకు 30 లక్షల రూపాయలు పారితోషికం ఇవ్వాలని అలాగే కథా రచయితగా టైటిల్స్ లో పేరు కూడా వేయాలని డిమాండ్ చేస్తున్నాడు .

అయితే సర్కార్ దర్శకుడు మురుగదాస్ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నాడు . సర్కార్ కథ రాజేంద్రన్ కు సంబంధం లేదని , అతడికి డబ్బులు ఇచ్చేది లేదని అంటున్నాడు . ఇక కోర్టు ఏమి నిర్ణయిస్తుందో ఈనెల 30 న తేలిపోతుంది . 30 న కోర్టు చెప్పేదాన్ని బట్టి సర్కార్ విడుదల విషయం తేలుతుంది . నవంబర్ 6 న సర్కార్ విడుదల చేయాలనీ భావిస్తున్నారు . ఏమౌతుందో ఈ వివాదం దాన్ని బట్టి ఉంటుంది సర్కార్ భవితవ్యం .

- Advertisement -

English Title: Release problem for vijay’s sarkar

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All