Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండని దెబ్బకొడుతుందా ? ఒడ్డున పడేస్తుందా ?

విజయ్ దేవరకొండని దెబ్బకొడుతుందా ? ఒడ్డున పడేస్తుందా ?

vijay devarakonda scared with taxiwalaనోటా తో ఘోర పరాజయాన్ని అందుకున్న హీరో విజయ్ దేవరకొండ . సరిగ్గా ఆ సినిమా తర్వాత గతకొంత కాలంగా ముక్కి మూలుగుతూ మూలానపడి ఉన్న సినిమా టాక్సీ వాలా విడుదల అవుతోంది . ఇప్పటికే నోటా పరాజయంతో విజయ్ దేవరకొండ అప్ సెట్ అయ్యాడు , ఇక ఇప్పుడు వస్తున్న టాక్సీ వాలా చిత్రంతో చాలా టెన్షన్ గా ఉన్నాడు ఇది హిట్ అవుతుందా ? ఫ్లాప్ అవుతుందా ? నన్ను ఒడ్డున పడేస్తుందా ?లేక దెబ్బ కొడుతుందా ? అంటూ . నవంబర్ 16 న టాక్సీ వాలా చిత్రం విడుదలకు సిద్దమైంది . రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల కావాల్సి ఉండే అయితే అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆ చిత్రాన్ని చూసి షాక్ అయి ఇలా విడుదల చేస్తే డిజాస్టర్ అవ్వడం ఖాయం కాబట్టి ఇలా చేయండి అంటూ మార్పులు సూచించాడట అందుకే ఇన్ని రోజులు గ్రాఫిక్స్ సమస్య అంటూ దాన్ని సరిచేసారు .

కట్ చేస్తే ఇప్పుడు నవంబర్ లో విడుదల చేస్తున్నారు . టాక్సీ వాలా ని బాగా రిపేర్ చేసి జనాల మీదకు వడులుతున్నాం అని మేకర్స్ అనుకుంటున్నారు . అయితే సరిగా రిపేర్ చేసారా ? లేదా ? అన్నది ప్రేక్షకులు నవంబర్ 16 న తేల్చి చెప్పనున్నారు . విజయ్ దేవరకొండ మాత్రం టాక్సీ వాలా విషయంలో చాలా టెన్షన్ పడుతున్నాడు . ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా అందునా చాలా రోజులు ఆగిన సినిమా మరి ఎలాంటి రిజల్ట్స్ ని ఇస్తుందో అన్న ఆత్రుత అందరిలో ఉంది . ఈ టాక్సీ వాలా విజయ్ కెరీర్ ని ముంచుతుందా ? ఒడ్డున పడేస్తుందా ? చూడాలి .

- Advertisement -

English Title: vijay devarakonda scared with taxiwala

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All