Monday, March 20, 2023
Homeటాప్ స్టోరీస్దుమ్ములేపిన సర్కార్ టీజర్

దుమ్ములేపిన సర్కార్ టీజర్

vijay's sarkar teaser creates new recordతమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ టీజర్ ని నిన్న సాయంత్రం విడుదల చేయగా వీర లెవల్లో దుమ్ము దులిపెస్తోంది ఆ టీజర్ . విజయ్ అంటేనే మాస్ ,దాంతో మాస్ ప్రేక్షకులకు నచ్చేలా టీజర్ ని రూపొందించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు దాంతో రికార్డుల మోత మోగిస్తోంది సర్కార్ టీజర్ . విజయ్ స్టైల్ , యాక్షన్ సీన్స్ , డైలాగ్స్ , టేకింగ్ వెరసి సర్కార్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని చెప్పకనే చెబుతోంది టీజర్ . వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ విజయ్ తో రొమాన్స్ చేయనుంది .

- Advertisement -

మురుగదాస్ – విజయ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ”కత్తి ”, ” తుపాకి ” రెండు చిత్రాలు కూడా సంచలన విజయాలను అందుకున్నాయి . ఆ రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ! తుపాకి ఇక్కడ డబ్ కాగా కత్తి చిత్రాన్ని చిరంజీవి తన 150 వ చిత్రంగా ఖైదీ నెంబర్ 150 గా రీమేక్ చేసాడు . ఇక మురుగదాస్ – విజయ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రమిది . దీంతో హ్యాట్రిక్ కంప్లీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది . దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: vijay’s sarkar teaser creates new record

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts