Homeటాప్ స్టోరీస్సర్కార్ ఫస్ట్ లుక్ పై పెద్ద ఎత్తున విమర్శలు

సర్కార్ ఫస్ట్ లుక్ పై పెద్ద ఎత్తున విమర్శలు

criticism on vijays sarkar first lookతమిళ స్టార్ హీరో విజయ్ తాజాగా నటిస్తున్న సర్కార్ చిత్రం ఫస్ట్ లుక్ తీవ్ర వివాదాన్ని రాజేస్తోంది . విజయ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని సర్కార్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు . ఆ లుక్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది , అయితే అంతకంటే ఎక్కువ వివాదాన్ని కూడా తెచ్చిపెట్టింది . ఇంతకీ సర్కార్ చిత్రంలో వివాదాస్పదం అయినది ఏదో తెలుసా …… సిగరెట్ . విజయ్ స్టైల్ గా సిగరెట్ తాగుతూ ఉండటమే ఈ వివాదానికి కారణం .

విజయ్ స్టార్ హీరో పైగా రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కావడంతో యువతని , అభిమానులను పక్క దోవ పట్టించే అవకాశం ఉందని …… యువతని సిగరెట్ల కు బానిస చేసేలా విజయ్ లుక్ ఉందని రాజకీయ నాయకులు , సామాజిక సేవా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు . విజయ్ ని అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు . సర్కార్ లుక్ లో విజయ్ చాలా బాగున్నాడని అయితే ఆ సిగరెట్ లేకపోతే ఇంకా బాగుండేదని సలహా కూడా ఇస్తున్నారు . ఇంతకుముందు కూడా విజయ్ కి ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఇకపై మద్యపానం , ధూమపానం లాంటి ప్రకటనలకు ఛాన్స్ ఇవ్వనని మాటిచ్చాడు కానీ తాజాగా సర్కార్ విషయంలో పొరబడ్డాడు విజయ్ దాంతో విమర్శలు వస్తున్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All