Homeటాప్ స్టోరీస్తెలంగాణ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా

తెలంగాణ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా

Sukumar next film with Vijay devarakonda టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం తెలంగాణ నేపథ్యంలో ఓ కథ రెడీ చేసుకున్నాడు దర్శకులు సుకుమార్ అయితే ఆ కథ నా మీద వర్కౌట్ కాదని , అంతగా నాకు సరిపడదని పైగా అందరూ 80 కాలం నాటి కథలే చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారని రిజెక్ట్ చేసాడు కట్ చేస్తే అదే కథని విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనీ ఆసక్తి చూపిస్తున్నాడట దర్శకులు సుకుమార్ . విజయ్ దేవరకొండ టాలీవుడ్ నయా సూపర్ స్టార్ అన్న విషయం తెలిసిందే . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది దాంతో అతడితో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు పలువురు దర్శక నిర్మాతలు .

ఇక మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథ ని విజయ్ దేవరకొండతో చేయడానికి కారణం ఏంటో తెలుసా …….. విజయ్ దేవరకొండ తెలంగాణ నేపథ్యం ఉన్న హీరో దాంతో అతడితో అయితే ఇంకా బాగా ఉంటుందని , డైలాగ్స్ పరంగా కూడా యాప్ట్ అని భావిస్తున్నాడట దర్శకులు సుకుమార్ . అయితే ఇదంతా ప్రాధమిక దశలోనే ఉంది ఎందుకంటే విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు . ఇద్దరి మధ్య చర్చలు జరగాలి , ఆ తర్వాత డేట్స్ కుదరాలి అప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది . లేదంటే ఈలోపు ఏమైనా జరగొచ్చు .

- Advertisement -

English Title: Sukumar next film with Vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All