
ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన రచయిత అన్న విషయం మనకు తెలుసు. రాజమౌళి డైరెక్ట్ చేసే సినిమాలకు కథలు అందించే విజయేంద్ర ప్రసాద్ బాహుబలితో పీక్ ను టచ్ చేసాడు. అలాగే పలు బడా బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకు కూడా పనిచేస్తున్నాడు ఈ టాప్ రచయిత.
బాలీవుడ్ లో సీత, కోలీవుడ్ లో తలైవి చిత్రాలకు కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే విజయేంద్ర ప్రసాద్ కు అమితమైన ఇష్టం. ఈ విషయాన్ని పలుమార్లు ఇంటర్వ్యూలలో తెలిపాడు కూడా. ఇప్పటిదాకా పవన్ సినిమాకు పనిచేయని విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడట. మరి ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది చూడాలి.
మరోవైపు పవన్ కళ్యాణ్ మల్టీపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్, హరిహర వీర మల్లు, హరీష్ శంకర్ చిత్రాలు చేస్తున్నాడు.