
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫామ్ హౌజ్ లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. కరోనా నుండి పూర్తిగా కోలుకుని నెల రోజులు గడుస్తున్నా ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో ఫామ్ హౌజ్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే తెలంగాణలో రేపటినుండి పూర్తి స్థాయిలో నిబంధనలను సడలించారు. ఏ విధమైన లాక్ డౌన్, కర్ఫ్యూ లేకపోవడంతో షూటింగ్స్ చేసుకునే వెసులుబాటు దొరికింది.
ఇక పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్స్ చేసుకోవడానికి తన సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జులై రెండో వారం నుండి పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొంటాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమాలు రెండు సెట్స్ పై ఉన్నాయి. మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు.
అలాగే క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు చిత్రం కూడా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ రెండు చిత్రాలను ఈ ఏడాది పూర్తి చేయనున్నాడు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా చేయాల్సి ఉంది.