Homeగాసిప్స్బిగ్‌బాస్ హోస్ట్ ఈ సారి సెన్సేష‌న‌ల్‌ స్టార్‌?

బిగ్‌బాస్ హోస్ట్ ఈ సారి సెన్సేష‌న‌ల్‌ స్టార్‌?

బిగ్‌బాస్ హోస్ట్ ఈ సారి సెన్సేష‌న‌ల్‌ స్టార్‌?
బిగ్‌బాస్ హోస్ట్ ఈ సారి సెన్సేష‌న‌ల్‌ స్టార్‌?

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. కంటెస్టెంట్‌ల ద‌గ్గ‌రి నుంచి హోస్ట్ వ‌ర‌కు వ‌రుస క్రేజీ వార్త‌ల‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. గ‌త సీజ‌న్ 3 కి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్య‌వంహ‌రించారు. ఈ సీజ‌న్‌కి సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ విజేత‌గా నిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఎలిమినేట్ అయ్యే స్థాయి నుంచి విజేత‌గా నిల‌వ‌డం వ‌ర‌కు ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య రాహుల్ బిగ్‌బాస్ సీజ‌న్ 3 విజేత‌గా నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన సీజ‌న్‌ల‌కి మించి తాజా షో వుండ‌బోతోంది. ఇందు కోసం బిగ్‌బాస్ టీమ్ ఇప్ప‌టికే భారీ ఏర్పాట్ల‌ని మొద‌లుపెట్టింది. బిగ్‌బాస్ 4 మ‌రింత సెన్సేష‌న్ గా నిల‌వాలంటే దీనికి సెన్సేష‌న‌ల్ స్టార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తోంద‌ని తాజాగా తెలుస్తోంది. ఇందు కోసం సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని బిగ్‌బాస్ 4కు హోస్ట్‌గా ఫైన‌ల్ చేయాల‌నే ఆలోచ‌న‌లో టీమ్ వున్న‌ట్టు ప్ర‌చారం మొద‌లైంది.

- Advertisement -

ముందు ఈ సీజ‌న్ కోసం ప‌లువురి పేర్లు తెర‌పైకొచ్చాయి. ఈ ద‌ఫా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని కొంత మంది ప్ర‌చారం చేస్తే లేదు నాగార్జున‌నే ఈ సారి కూడా హోస్ట్ వ్య‌వ‌హ‌రిస్తారని లేదు లేదు ఆయ‌న స్థానంలో ఆయ‌న కోడలు స‌మంత హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఇందులో నిజం ఎంత అన్న‌ది తెలియాలంటే బిగ్‌బాస్ మేక‌ర్స్ అనౌన్స్ చేసే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All