Homeటాప్ స్టోరీస్నువ్వో నేనో తేల్చుకుందాం రా.. అంటున్నాడు!

నువ్వో నేనో తేల్చుకుందాం రా.. అంటున్నాడు!

Vijay deverakonda nuvvo neno telchukundam raa
Vijay deverakonda nuvvo neno telchukundam raa

జ‌న‌నీ జ‌న్మ భూమిచ్చా స్వ‌ర్గాద‌పీ గ‌రియ్యాసీ.. స్వ‌ర్గాద‌పీ గ‌రియ్యాసీ.. ఏ త‌ల్లి నినుక‌న్న‌దో ఆత‌ల్లినే క‌న్న భూమి గొప్ప‌దిరా…అన్నాడో సినీ క‌వి. కానీ ఆ గొప్ప భూమి మ‌హిళ‌ల పాలిట మ‌రు భూమిగా మారుతోంది. ప్ర‌పంచ దేశాల‌న్నీ భార‌త స్త్రీ అంటే త‌ల‌వంచి న‌మ‌స్క‌రిస్తాయ‌ని ఎప్పుడో చ‌దువుకున్నాం. చాలా సినిమాల్లో ఆ మాట‌ల్ని చెవులారా విన్నాం. కానీ మ‌న మ‌హిళ‌ల్ని, మాతృమూర్తుల్ని మ‌న‌మే త‌లెత్తి గౌర‌వించ‌లేక‌పోతున్నాం. స్త్రీల‌ని గౌర‌వించ‌డంలో ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శంగా నిలిచిన మ‌నం ఇప్ప‌డు ఎటు వెళుతున్నాం?. ఏం చేస్తున్నాం. మ‌హిళ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేని స‌మాజంలోకి బ‌ల‌వంతంగా నెట్టివేయ‌బ‌డుతున్నామా?  లేక మ‌హిళ విలువ‌ తెలియ‌క ప్ర‌వ‌ర్తిస్తున్నామా? అనే అనుమానం క‌లుగుతోంది.

ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దురాగ‌తాల్ని, అఘాయిత్యాల్ని అడ్డ‌కోలేక‌పోతోంది. ఏడాది లోపు పిల్ల‌ల నుంచి కాటికి కాలు చాపిన ముదుస‌లి వ‌ర‌కు మాన‌వ మృగాలు ఎవ్వ‌రినీ విడిచి పెట్ట‌డం లేదు. రాక్ష‌స సంత‌తికి ప్ర‌తీక‌గా నిలుస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌రకు 63 మిలియ‌న్‌ల మంది మ‌హిళ‌లు మిస్స‌య్యారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా త‌యారైందో అర్థం చేసుకోవ‌చ్చు. బ‌య‌టికి వెళ్లిన మ‌హిళ ఇంటికి సేఫ్‌గా తిరిగి వ‌స్తుంద‌నే గ్యారెంటీలేని రోజుల్లోకి వ‌చ్చేశాం. త‌ల్లిగా, చెల్లిగా, భార్య‌గా, కూతురిగా వుంటే మ‌హిళ‌పై ఏం జ‌రుగుతోంది? ఎందుకి మిస్స‌వుతున్నారు? అలా మిస్స‌యిన వారి బంధువుల అర‌ణ్య రోద‌న ఎలా వుంటుంది? అనే కాన్సెప్ట్‌తో హ్యుమ‌న్ ట్రాఫికింగ్‌పై `నువ్వో నేనో తేల్చుకుందాం రా..` అనే పేరుతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ వీడియో ఆల్బ‌మ్ చేశాడు.

- Advertisement -

`మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ వద్ద ప‌లు చిత్రాల‌కు అసోసియేట్‌గా ప‌నిచేసిన ర‌మ‌ణ‌వ్‌ మ‌ల్ల‌మ్ (వెంక‌ట‌ర‌మ‌ణ‌) ఈ ఆల్బ‌మ్‌ని న‌టించి రూపొందించారు. వైష్ణ‌వి న‌టించిన ఈ ఆల్బ‌మ్‌ని సాయి వైష్ణ‌వి స్టూడియోస్‌, వాలుజ‌డ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ వీడియో ఆల్బ‌మ్‌ని రిలీజ్ చేశారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All