
అక్కినేని మూడు తరాల నటులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన చిత్రం `మనం`. ఈ చిత్రం వెండితెరపై ఎలాంటి మ్యాజిక్‌ని చేసిందో అందరికి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీకి మెమొరబుల్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇదే తరహాలో ఘట్టమనేని ఫ్యామిలీ కూడా ఓ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఘట్టమనేని మనం రాబోతోందంటూ వరుస పుకార్లు షికారు చేస్తున్నాయి. ఓ ప్రముఖ దర్శకుడు ఘట్టమనేని మనం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఘట్టమనేని ఫ్యామిలీకి `మనం` తరహా సినిమా చేయాలనే ఆలోచన లేదని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఏమీ జరగడం లేదని తాజాగా ఘట్టమనేని ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా వుండే ఓ వ్యక్తి క్లారిటీ ఇచ్చేశారు.
పోరాటం, కొడుకు దిద్దిన కాపురం అన్నాదమ్ములు, వంశీ వంటి చిత్రాల్లో సూపర్‌స్టార్ కృష్ణతో కలిసి మహేష్ నటించిన విషయం తెలిసిందే. `వన్ నేనొక్కడినే` చిత్రంలో తొలిసారి మహేష్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిందే. ఈ చిత్రం ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.