
విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ తాజా సెన్సేషన్. ఈ హీరోకు యూత్‌లో వున్నఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన క్రేజ్‌నే ఓ బ్రాండ్‌గా మలుచుకుని రౌడీ బ్రాండ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో అతని క్రేజ్ డౌన్ అయిందని, ఇక డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని ప్రచారం చేయడం మొదలైంది.
అయితే తాజాగా వినిపిస్తున్న ఓ వార్త అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. ప్రస్తుతం `ఇస్మార్ట్ శంకర్` హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీరకణ ముంబైలో యమ స్పీడుగా జరుగుతోంది. ఇదిలా వుంటే విజయ్ దేవరకొండతో కరణ్ జోహార్ ఓ బిగ్‌డీల్ కుదుర్చుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డీల్ ఖరీదు 100 కోట్లు అని తెలిసింది. ఈ డీల్‌తో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో వరుసగా చిత్రాలు నిర్మించాలని కరణ్ జోహార్ ప్లాన్ చేశాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారకంగా బయటికి రానున్నట్టు తెలిసింది.