Homeటాప్ స్టోరీస్విజ‌య్ దేవ‌ర‌కొండ పేరుతో ఫేక్ అకౌంట్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ పేరుతో ఫేక్ అకౌంట్‌!

Vijay deverakonda fake acount goes viral
Vijay deverakonda fake acount goes viral

క్రేజీ హీరోలు, లేదా హీరోయిన్‌ల పేరుతో ఫేక్ అకౌంట్‌ల‌ని సృష్టించి అమాయ‌కుల‌ని మోసం చేసే ముఠాలు రోజు రోజుకు ఎక్కువ‌వుతున్నాయి. ఇటీవ‌ల చాలా మంది టాప్ స్టార్‌ల సోష‌ల్‌మీడియా అకౌంట్ల‌కు ఫేక్ అకౌంట్‌లు సృష్టిస్తూ అమాయ‌కుల‌కు వ‌ల వేస్తున్నారు. మోసం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ మోస‌మే వెలుగులోకి వ‌చ్చింది.

టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ. ఈ మ‌ధ్య వ‌రుస‌గా ఫ్లాపులు ప‌ల‌క‌రించినా ఈ హీరో క్రేజ్ ఏమాతంరం త‌గ్గ‌లేదు. అయితే అతని పేరుతో ఓ మోస‌గాడు ఫేక్ ఎకౌంట్‌ని క్రియేట్ చేసి అమాయ‌కులైన అమ్మాయిల‌ని వేధిస్తున్నాడ‌ని తెలిసింది. మొత్తం ప‌ది మంది అమ్మాయిల్ని మోస‌గాడు అస‌భ్య ప‌ద‌జాలంతో స‌హ‌జీవ‌నం చేద్దామ‌ని వేధిస్తున్నాడ‌ట‌.

- Advertisement -

ఈ విష‌యం తెలిసిన ఓ వ్య‌క్తి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. త‌న అసిస్టెంట్ గోవింద్‌ని అమ్మాయిగా ఛాటింగ్ చేయించి స‌ద‌రు మోస‌గాడిని విజ‌య్ సైడ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ప‌ట్టించిన‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All