Homeటాప్ స్టోరీస్రౌడీ హీరో ఎవ‌రికి ఛాలెంజ్ విసిరాడు?

రౌడీ హీరో ఎవ‌రికి ఛాలెంజ్ విసిరాడు?

రౌడీ హీరో ఎవ‌రికి ఛాలెంజ్ విసిరాడు?
రౌడీ హీరో ఎవ‌రికి ఛాలెంజ్ విసిరాడు?

టాలీవుడ్‌లో బి ద రియ‌ల్ మెన్ ఛాలెంజ్ య‌మ జోరుగా సాగుతోంది. సందీప్‌రెడ్డి వంగ ఏ టైమ్‌లో మొద‌లుపెట్టాడో కానీ ఈ ఛాలెంజ్ టాలీవుడ్ టు బాలీవుడ్‌, మాలీవుడ్‌, కోలీవుడ్‌ల‌కి పాకింది. అయితే ఇంకా బాలీవుడ్ నుంచి గానీ, కోలీవుడ్ నుంచి గానీ ఎలాంటి స్పంద‌న రాలేదు. తాజాగా రౌడీ హీరో మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌కి ఛాలెంజ్ విసిరారు.

ఎన్టీఆర్ నామినేట్ చేయ‌డంతో కొర‌టాల శివ త‌న ఛాలెంజ్‌ని పూర్తి చేసి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని నామినేట్ చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌న‌రి ఇప్ప‌టికీ రియ‌ల్ మెన్‌గా చూడ‌టం లేద‌ని, ఇంట్లో ప‌ని కూడా చేయ‌నివ్వ‌డం లేద‌ని, త‌ను ప‌ని చేస్తే ఇంకా ఎక్కువ‌వుతుంద‌ని అమ్మ అంటోంద‌ని నివ్వించిన విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా ఫైన‌ల్లీ ఓ వీడియోని వ‌దిలాడు.

- Advertisement -

అయితే అంద‌రిలా త‌న‌కి ఇంకా పెళ్లి కాలేదు కాబ‌ట్టి ఊహించిన‌ట్టే కొంచెం భిన్నంగా వీడియోని పోస్ట్ చేశాడు. లేట్‌గా లేవ‌డం ద‌గ్గ‌రి నుంచి మ్యాంగోని క‌ట్ చేసి జ్యూస్ చేసి.. ఫ్రీజ్‌లో పెట్టి అది కూల్ అయిన త‌రువాత త‌న త‌మ్ముడికి, అమ్మ‌కు, నాన్న‌కి స‌ర్వ్ చేశాడు. టీవీ క్లీన్ చేయ‌డం…వీడియో గేమ్ క్లీన్ చేసుకోవ‌డం..  తో తన ఛాలెంజ్‌ని పూర్తి చేశాడు. ఈ వీడియోని ఎవ‌రు షూట్ చేశారో కూడా వెల్ల‌డించాడు. త‌న త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ ఈ వీడియోని షూట్ చేశాడ‌ని, త‌ను దుల్క‌ర్ స‌ల్మాన్ నామినేట్ చేస్తున్నాన‌ని ఛాలెంజ్ ని కంప్లీట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All