Homeటాప్ స్టోరీస్ఫీల్డ్ లెవెల్ పోలీస్ ఆఫీస‌ర్ల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

ఫీల్డ్ లెవెల్ పోలీస్ ఆఫీస‌ర్ల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

ఫీల్డ్ లెవెల్ పోలీస్ ఆఫీస‌ర్ల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
ఫీల్డ్ లెవెల్ పోలీస్ ఆఫీస‌ర్ల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ప్రాణాల‌కు తెగించి ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న పోలీస్ అధికారుల‌తో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. హైద‌రాబాద్  క‌మీష‌న‌రేట్‌లో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పోలీసుల‌తో ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ కార్య‌క్ర‌మం న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ అంజ‌న్‌కుమార్ ఆంధ్వ‌ర్యంలో జ‌రిగింది.

ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో నిజ‌మైన హీరోలుగా నిలుస్తున్న పోలీసు అధికారుల‌ను, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప‌ల‌క‌రించారు. వృత్తి నిర్వ‌హ‌ణ‌లో క్ష‌ణం తీరిక లేకుండా డ్యూటీ చేస్తున్న పోలీసుల‌కు విజ‌య్ ప‌ల‌క‌రింపులు ఊర‌ట‌నిచ్చాయి.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా పోలీసు సిబ్బంది అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ స‌మాధానాలు చెప్పారు. సినిమాల్లో పోలీసు అధికారి పాత్ర‌లో మిమ్మ‌ల్ని చూడాల‌ని వుంద‌ని కోర‌డంతో విజ‌య్ మంచి స్క్రిప్ట్ వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని, రెండు మూడు సంవ‌త్స‌రాల్లో మంచి పోలీస్ పాత్ర‌తో మీ ముందుకు వ‌స్తాన‌ని చెప్ప‌డం ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All