Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ కొత్త టైటిల్ బ్రేకప్ !

విజయ్ దేవరకొండ కొత్త టైటిల్ బ్రేకప్ !

విజయ్ దేవరకొండ తాజాగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ముగ్గురు హీరోయిన్ లు రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ లు నటిస్తున్న ఈ చిత్రానికి ” బ్రేకప్ ” అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది . ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ లవ్ పదేపదే బ్రేకప్ అవుతూ ఉంటుందట దాంతో ఈ భగ్న ప్రేమికుడి సినిమాకు బ్రేకప్ అనే టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారట చిత్ర బృందం .

ఇప్పటికైతే ఈ టైటిల్ ని ఫిక్స్ చేయలేదు కానీ ఆ ఆలోచన అయితే చేస్తున్నారు . విజయ్ దేవరకొండ వరుస విజయాలు సాధిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . క్రాంతిమాధవ్ కు మంచి దర్శకుడిగా పేరుంది కానీ సాలిడ్ గా కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు దాంతో విజయ్ దేవరకొండ పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు . ఇక ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత కే ఎస్ రామారావు తనయుడు వల్లభ నిర్మిస్తున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All