Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండకు జూలై అగ్నిపరీక్ష

విజయ్ దేవరకొండకు జూలై అగ్నిపరీక్ష

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు జూలై నెల అగ్నిపరీక్ష కానుంది . టాలీవుడ్ లో వరుస విజయాలతో అనూహ్యంగా ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ . అయితే ఆ క్రేజ్ కు అసలు సిసలైన అగ్నిపరీక్ష జూలై మాసంలో జరుగనుంది . ఆ పరీక్ష నుండి విజయ్ దేవరకొండ గట్టెక్కుతాడా చూడాలి . ఇంతకీ ఈ హీరో కు ఎదురయ్యే పరీక్ష ఏంటంటే ……. తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసాని చిత్రం రిలీజ్ కి ఉంది . ఆ చిత్రాన్ని జూలై 5 న విడుదల చేయనున్నారు . ఇక డియర్ కామ్రేడ్ చిత్రాన్ని జూలై 26 న విడుదల చేయనున్న విషయం తెలిసిందే .

- Advertisement -

అంటే ఒకే నెలలో ఒకవైపు తమ్ముడి సినిమా మరోవైపు తన సినిమా విడుదల కానుంది . తమ్ముడి సినిమా జూలై 5 న అంటే దానికి మూడు వారాల కు డియర్ కామ్రేడ్ వస్తోంది . ఈ రెండు కూడా హిట్ కావాలి అప్పుడే తనకున్న క్రేజ్ కు అర్ధం లేదంటే ప్రత్యర్థి హీరోల అభిమానులు విజయ్ దేవరకొండ గాలి తీయడం ఖాయం . తమ్ముడు హిట్ అయితే అదో సంతోషం అలాగే తన సినిమా కూడా హిట్ అయితేనే నిజమైన సంతోషం . మరి ఈ విజయాలను విజయ్ దేవరకొండ సాధించగలడా ? లేదా ? తెలియాలంటే జూలై లోనే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All