Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండని వాడుకున్నారు

విజయ్ దేవరకొండని వాడుకున్నారు

Vijay devarakonda fans unhappy with allu arjun నిన్న టాక్సీ వాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ పెట్టారు కానీ అక్కడ జరిగింది టాక్సీ వాలా ఈవెంట్ కాదు అల్లు అర్జున్ ని పొగిడే కార్యక్రమం . దాంతో టాక్సీ వాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి విజయ్ దేవరకొండ ని బాగా వాడేసుకున్నారని కామెంట్స్ వస్తున్నాయి . ఇటీవలే అల్లు అర్జున్ కేరళ వెళ్లి వచ్చాడు . అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బోట్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ని గెస్ట్ గా ఆహ్వానించింది . అల్లు అర్జున్ కు కేరళలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దాంతో కేరళకు వెళ్లి రాగానే అల్లు అర్జున్ ని సదరన్ స్టార్ అంటూ పొగుడుతూ వక్తలు పెద్ద ప్రసంగాలు చేసారు . అంతేనా వేదిక మీద కూడా అల్లు అర్జున్ కు సంబందించిన పాటలకు డ్యాన్స్ లు చేయించారు .

ఆ వేదిక మీద టాక్సీ వాలా ప్రమోషన్ కంటే అల్లు అర్జున్ ప్రమోషన్ ఎక్కువయ్యింది . సదరన్ స్టార్ అంటూ ఏకంగా బిరుదులు ఇచ్చేస్తూ అల్లు అర్జున్ ని సదరన్ స్టార్ ( టోటల్ సౌత్ ఇండియా స్టార్ ) ని చేసి పడేసారు అల్లు అర్జున్ మనుషులు . దాంతో విజయ్ దేవరకొండ అభిమానులకు కోపం తన్నుకొచ్చింది కాబోలు అల్లు అర్జున్ తో పాటుగా మిగతా వాళ్ళు మాట్లాడుతున్న ప్రతీ సందర్భంలో గోల గోల చేసారు విజయ్ దేవరకొండ అభిమానులు . మొత్తానికి పేరు ఏమో టాక్సీ వాలా ప్రమోషన్ ఈవెంట్ కానీ జరిగింది అల్లు అర్జున్ ని సదరన్ స్టార్ గా ప్రమోట్ చేయడం .

- Advertisement -

Englih Title: Vijay devarakonda fans unhappy with allu arjun

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All