Homeటాప్ స్టోరీస్విజయ్ సినిమా హక్కుల్ని చేజిక్కించుకున్న మహేష్

విజయ్ సినిమా హక్కుల్ని చేజిక్కించుకున్న మహేష్

Bigil
విజయ్ సినిమా హక్కుల్ని చేజిక్కించుకున్న మహేష్

టైటిల్ చూసి అనవసరంగా ఏదో ఊహించుకోకండి. ఇక్కడ చెప్పేది సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కాదు. ఇలయథలపతి విజయ్ కు తమిళ్ లో ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాక్ ఏ మాత్రం బాగున్నా కలెక్షన్స్ సునామీ సృష్టించడం విజయ్ సినిమాలకే చెల్లింది. సినిమా బాలేకపోయినా డిజాస్టర్ అవ్వకుండా అతని స్టార్ పవర్ కాపాడగలదు.

అయితే విజయ్ కు తమిళ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నా తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలన్న అతని ఆశలు మాత్రం తీరట్లేదు. తుపాకీ, అదిరింది, పోలీస్ చిత్రాలతో ఓ మాదిరి కలెక్షన్లు తెచ్చుకున్నా అవి విజయ్ మార్కెట్ ను పెంచడంలో ఏ మాత్రం సహాయపడలేకపోయాయి.

- Advertisement -

ఇదిలా ఉంటే విజయ్ తాజాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నటించిన చిత్రం బిగిల్. తమిళ్ లో ఈ చిత్రం దీపావళికి విడుదలవుతోంది. తమిళ్ తో పాటే తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు డబ్బింగ్ హక్కుల్ని 118 సినిమాను నిర్మించిన మహేష్ ఎస్ కోనేరు ఫ్యాన్సీ ఆఫర్ పెట్టి చేజిక్కించుకున్నాడు. మరి ఈ సినిమానైనా విజయ్ కోరిక తీరుస్తుందా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All