
దర్శకులు వివివినాయక్ కు మహేష్ బాబు ని డైరెక్ట్ చేయాలనీ ఎప్పటి నుండో ఆశగా ఉంది కానీ ఆ ఆశ ఇంతవరకు నెరవేరలేదు పాపం .
ఎన్నో ప్రయత్నాలు చేసాడు కానీ కుదరలేదు ఇక శ్రీమంతుడు ఆడియో వేడుకలో తన కోరికని అందరి ముందు బయటపెట్టాడు అంతేకాదు మహేష్ తో 100 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తానని ప్రకటించాడు .
శ్రీమంతుడు విడుదల అయ్యింది హిట్ అయ్యింది , నాలుగేళ్లు కూడా గడిచిపోయింది కానీ వినాయక్ – మహేష్ బాబు ల కాంబినేషన్ మాత్రం సెట్ కాలేదు . గతకొంత కాలంగా వినాయక్ కు హిట్స్ లేకుండాపోయాయి దాంతో ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు .
దాంతో బాలకృష్ణ చుట్టూ తిరుగుతున్నాడు అక్కడ కూడా వర్కౌట్ కాలేదు దాంతో ఇప్పుడు తానె హీరోగా నటించడానికి సిద్దమయ్యాడు వినాయక్ . ఇక మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు .