Homeటాప్ స్టోరీస్75 కోట్లకు పైగా షేర్ సాధించిన హీరోలు

75 కోట్లకు పైగా షేర్ సాధించిన హీరోలు

టాలీవుడ్ లో బిజినెస్ రేంజ్ పెరిగింది దాంతో అగ్ర హీరోలు అవలీలగా కోట్ల కొద్దీ వసూళ్లు సాధిస్తున్నారు అయితే భారీ బడ్జెట్ తో చిత్రాలను నిర్మిస్తూ నేలవిడిచి సాము చేస్తుండటంతో కొన్ని సినిమాలు దర్శక నిర్మాతలకు బయ్యర్లకు చుక్కలు చూపిస్తున్నాయి . అయితే అడపా దడపా ప్రతీ ఏడాది ఏదో ఒక బ్లాక్ బస్టర్ టాలీవుడ్ ని ఆదుకుంటూనే ఉంది . టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న హీరోలు చిరంజీవి , వేంకటేష్ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ , రాంచరణ్ లు మాత్రం తమ సినిమాలతో భారీ వసూళ్ల ని సాధిస్తూ చరిత్ర సృస్టిస్తున్నారు .

- Advertisement -

చిరంజీవి నటించిన కం బ్యాక్ ఫిలిం ఖైదీ నెంబర్ 150 చిత్రంతో 90 కోట్ల షేర్ అందుకున్నాడు , 164 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది చిరు 150 వ చిత్రం . ఇక మరో సీనియర్ హీరో వెంకటేష్ నటించిన ఎఫ్ 2 దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని 75 కోట్ల షేర్ ని సాధించింది . పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది 187 కోట్ల గ్రాస్ వసూళ్ల ని 80 కోట్ల షేర్ ని వసూల్ చేసింది . మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు , భరత్ అనే నేను , మహర్షి చిత్రాలు 75 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసాయి . అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ , జైలవకుశ , అరవింద సమేత చిత్రాలతో 75 కోట్లకు పైగా షేర్ సాధించాడు . ప్రభాస్ బాహుబలి , బాహుబలి 2 చిత్రాలతో ఈ మార్క్ ని దాటేశాడు . రాంచరణ్ మగధీర , రంగస్థలం చిత్రాలతో 75 కోట్ల మార్క్ ని అధిగమించాడు . అయితే ఈ లిస్ట్ లో సీనియర్ హీరోలు బాలయ్య , నాగార్జున లేరు . అలాగే అల్లు అర్జున్ కూడా సరైనోడు చిత్రంతో ఈ మార్క్ ని చేరుకున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All